టీఆర్‌‌ఎస్‌ మెతక వైఖరి..: రెచ్చిపోతున్న బీజేపీ

ఇన్నాళ్లు టీఆర్‌‌ఎస్‌ చేసిన మాయలో మిగితా పార్టీలు ఉండిపోయాయి. కానీ.. ఇప్పుడు బీజేపీ చేస్తున్న మాయలో అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీ పడుతోంది. అందుకే రాష్ట్రంలో ఇలా దాడులు పెరిగిపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ నేతలు ఎక్కడికి వెళ్లినా దాడులు చేయడాన్నే వ్యూహంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేశారు. తాజాగా బండి సంజయ్ సూర్యాపేట జిల్లాలో భూముల పరిశీలనకు వెళ్తే.. అక్కడా కార్యకర్తలు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆస్తుల ధ్వంసమే […]

Written By: Srinivas, Updated On : February 8, 2021 2:05 pm
Follow us on


ఇన్నాళ్లు టీఆర్‌‌ఎస్‌ చేసిన మాయలో మిగితా పార్టీలు ఉండిపోయాయి. కానీ.. ఇప్పుడు బీజేపీ చేస్తున్న మాయలో అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీ పడుతోంది. అందుకే రాష్ట్రంలో ఇలా దాడులు పెరిగిపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ నేతలు ఎక్కడికి వెళ్లినా దాడులు చేయడాన్నే వ్యూహంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేశారు. తాజాగా బండి సంజయ్ సూర్యాపేట జిల్లాలో భూముల పరిశీలనకు వెళ్తే.. అక్కడా కార్యకర్తలు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆస్తుల ధ్వంసమే కాదు.. పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఇక హుజూర్‌‌నగర్‌‌ నియోజకవరగ్ంలో కొంత మంది గిరిజనుల భూములను కబ్జా పెట్టారు. ఆ విషయం బయటకు వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అసెంబ్లీలో ఈ విషయాన్ని చెప్పారు.

Also Read: చిరుతో ఈటల భేటీ..: ఏంటీ రహస్యం

ఆ భూముల్లో ఓ సంస్థ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ పెట్టాలని అనుకుంది నిర్మాణాలు ప్రారంభించింది. అయితే.. ఆ భూములన్నీ గిరిజనులవంటూ బీజేపీ ఆదివారం గిరిజన భరోసా యాత్రను నిర్వహించారు. అందరూ బస్సులో గుర్రంపోడు గ్రామానికి వెళ్లారు. అక్కడ సభ ఏర్పాటు చేశారు. అయితే.. బండి సంజయ్ వస్తున్న సమయంలోనే బీజేపీ కార్యకర్తలు సభకు కిలోమీటర్ దూరంలో ఆ భూముల్లో ఏర్పాటు చేసిన షెడ్లపై పడ్డారు. కూల్చేందుకు ప్రయత్నించారు. కానీ.. బీజేపీ కార్యకర్తలు షెడ్లతో పాటు పోలీసులను కూడా కూల్చేందుకు వెనుకాడలేదు. డీఎస్పీ, సీఐల్లాంటి అధికారులకు సైతం రాళ్ల దెబ్బలు తగిలాయి. రక్తం కారుతూంటే వారు ఆస్పత్రికి పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ ఉద్రిక్తత తర్వాత బండి సంజయ్ బహిరంగసభలో మాట్లాడారు. కరసేవ ప్రారంభమైందన్నట్లుగా.. టీఆర్ఎస్‌తో యుద్ధం ప్రారంభమైందన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు.

పోరాటం టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉందని చెప్పుకోడానికి ఇలా దాడులు చేయడమే మార్గమని బీజేపీ వ్యూహకర్తలు నిర్ణయానికి వచ్చినట్లుగా ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల నుంచి బీజేపీ అదే వ్యూహం పాటిస్తోంది. తామే ప్రధాన పోటీ దారు అని చెప్పుకోవాలంటే.. వివాదాస్పద విషయాల్లో హైలెట్ అవ్వాలని అనుకుంటోంది. హైదరాబాద్ లాంటిచోట్ల మాటలకు పబ్లిసిటీ వస్తుంది కానీ.. ఇతర చోట్ల దాడులే ఆ పనిచేస్తాయని నమ్మకం వచ్చినట్లుగా ఉంది. ఏ కార్యక్రమం పెట్టుకున్నా అదే పని కానిచ్చేస్తోంది. బీజేపీ విషయంలో టీఆర్ఎస్ దూకుడుగా వెళ్లకపోవడం వారికి మరింత అడ్వాంటేజ్‌గా మారుతోంది.

Also Read: నిమ్మగడ్డకు సడెన్ గా తీవ్ర అస్వస్థత.. కడప టూర్ క్యాన్సిల్.. ఏమైంది?

త్వరలో నాగార్జున సాగర్‌‌ బై పోల్‌ జరగనుంది. పొరుగునే ఉన్న సాగర్ ఉపఎన్నికలో తామే ప్రధాన ప్రత్యర్థిగా ఉండాలన్న లక్ష్యంతో బీజేపీ హుజూర్‌‌నగర్ రచ్చ చేసిటన్లుగా తెలుస్తోంది. కానీ.. ఈ దాడుల వ్యవహారం బీజేపీకి చెడ్డ పేరు తెస్తుందనే విషయాన్ని మరుస్తున్నారు. అర్థం పర్థం లేని ఆవేశంతో అందరిపైనా దాడులు చేసుకుంటూ వెళ్తే ప్రజల్లో బ్యాడ్ ఇమేజ్ పెరుగుతుంది తప్ప సానుభూతి రాదు. కానీ టీఆర్ఎస్‌తో పోటీ పడుతోంది తామే అని చెప్పుకోవాలంటే తప్పదన్నట్లుగా దాడులకు పాల్పడుతున్నట్లే కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్