చంద్రబాబు ‘పంచాయతీ’ ప్లాన్లు.. మామూలుగా లేవుగా!

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలును, ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ హింసా రాజకీయాలకు తెరలేపుతున్నారని ఆరోపణలు గుప్పించారు. Also Read: చిరుతో ఈటల భేటీ..: ఏంటీ రహస్యం ఏపీ సీఎం వైఎస్ […]

Written By: Srinivas, Updated On : February 8, 2021 1:56 pm
Follow us on


ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలును, ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ హింసా రాజకీయాలకు తెరలేపుతున్నారని ఆరోపణలు గుప్పించారు.

Also Read: చిరుతో ఈటల భేటీ..: ఏంటీ రహస్యం

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ సిద్ధాంతంతో రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లా మాచర్ల, చిత్తూరు జిల్లా పుంగనూరు టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో నామినేషన్ వేసే అభ్యర్థులను మంత్రి పెద్దిరెడ్డి భయపెడుతున్నారని, భయానక వాతావరణం సృష్టిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

ఇదిలా ఉండగా.. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులకు రక్షణ కల్పించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల సంఘంపై ఉందని చంద్రబాబు అంటున్నారు. ఒకవేళ ఎవరైనా నామినేషన్లు తీసుకోకుండా అడ్డుపడితే ఈ–మెయిల్ ద్వారా జిల్లా కలెక్టర్, ఎన్నికల కమిషనర్, పార్టీ కేంద్ర కార్యాలయానికి నామినేషన్లు పంపించాలని చంద్రబాబు సూచించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

Also Read: నిమ్మగడ్డకు సడెన్ గా తీవ్ర అస్వస్థత.. కడప టూర్ క్యాన్సిల్.. ఏమైంది?

అంతేకాదు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి కార్యక్రమాలు చేయలేదని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ నేడు పోటీచేయడానికి బరిలోకి దిగుతున్న అభ్యర్థులను బెదిరిస్తున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చిన అభ్యర్థులను వేధిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. నామినేషన్ వేస్తే ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు.

పోలీసులు కూడా అభ్యర్థులను బెదిరింపులకు గురి చేయడం అక్రమాలకు పరాకాష్టగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో గ్రామస్తులంతా సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలంలో జరుగుతున్న దాడులపై సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదులు చేస్తున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్