https://oktelugu.com/

Etela Rajender: ఈటలను హగ్ చేసుకున్న టీఆర్ఎస్ సీనియర్ నేతలు, సాదర స్వాగతాలు.. ఏం జరుగుతోంది.?

Etela Rajender: తెలంగాణలో బీజేపీ క్రమంగా బలం పుంజుకుంటోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నేతలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చే క్రమంలో నేతలు వ్యూహాలు ఖరారు చేస్తున్నారు. ఇందుకోసమే పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నేతలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ నేతలు చెబుతుంటే కొన్ని సంఘటనలు వాటిని నిజమనిపించేలా చేస్తున్నాయి. ఈ మధ్య పలు సందర్భాల్లో బీజేపీ నేతలు అన్ని పార్టీల నేతలు తమ […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 13, 2021 / 11:26 AM IST
    Follow us on

    Etela Rajender: తెలంగాణలో బీజేపీ క్రమంగా బలం పుంజుకుంటోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నేతలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చే క్రమంలో నేతలు వ్యూహాలు ఖరారు చేస్తున్నారు. ఇందుకోసమే పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నేతలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ నేతలు చెబుతుంటే కొన్ని సంఘటనలు వాటిని నిజమనిపించేలా చేస్తున్నాయి. ఈ మధ్య పలు సందర్భాల్లో బీజేపీ నేతలు అన్ని పార్టీల నేతలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.

    Keshava Rao and Etela Rajender

    కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వివాహానికి అన్ని పార్టీల నేతలతోపాటు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా హాజరయ్యారు. దీనికి టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు కూడా వచ్చారు. దీంతో ఇద్దరు ఎదురెదురుగా రావడంతో కేకే ఈటలను ఆలింగనం చేసుకున్నారు. దీంతో అందరు ఆశ్చర్యపోయారు.

    ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కేశవరావు కూడా పార్టీ మారతారా అనే సందేహాలు వస్తున్నాయి. ఈటల రాజేందర్ కు కేశవరావుకు ఉన్న అనుబంధం దృష్ట్యా ఇక్కడ చోటుచేసుకున్న సంఘటనతో అందరిలో సంశయాలు వస్తున్నాయి. కేకే ఈటల మధ్య సాగిన ఆలింగనంతో రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

    Also Read: Martyrs Stupa: అమరవీరుల స్తూపం ఆంధ్రా కాంట్రాక్టర్ తో నిర్మించడంలో ఆంతర్యమేమిటి?

    దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ కేకే ఈటలను హత్తుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఆయన పాత్రపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో ఏం జరుగుతోందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. బీజేపీ నేతల మాటల్లో అంతరార్థం ఏమిటనే ప్రశ్న అందరిలో వస్తోంది. ఏదిఏమైనా రాష్ర్టంలో రాజకీయ పరిణామాలు మారుుతున్నాయనే సంగతి మాత్రం ఎవరికి అర్థం కావడం లేదని తెలుస్తోంది.

    Also Read: Ch. Vittal: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన పోరుబిడ్డ సీహెచ్. విఠల్ ప్రస్థానం

    Tags