https://oktelugu.com/

Rashmika: బ్లాక్​ శారీ హాట్​ లుక్స్​తో కవ్విస్తోన్న రష్మిక.. నెట్టింట్లో పిక్స్ వైరల్​

Rashmika: ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా వస్తోన్న సినిమా పుష్ప. క్రియేటివ్​ దర్శకుడు సుకుమార్​ తెరకెక్కించిన ఈ భారీ పాన్​  ఇండియా చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా గురించి ప్రకటించిన మొదటి నుంచి అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఈ క్రమంలోనే టీజర్​, పోస్టర్లు, పాటలు రిలీజ్​ చేసి.. అందుకు తగ్గ హైప్​ను పెంచారు మేకర్స్​. సాధారణంగా సుకుమార్​- అల్లు అర్జున్​ కాంబో అంటేనే ఏదో కొత్తదనం ఆశిస్తున్నారు ప్రేక్షకులు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 13, 2021 / 11:26 AM IST
    Follow us on

    Rashmika: ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా వస్తోన్న సినిమా పుష్ప. క్రియేటివ్​ దర్శకుడు సుకుమార్​ తెరకెక్కించిన ఈ భారీ పాన్​  ఇండియా చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా గురించి ప్రకటించిన మొదటి నుంచి అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఈ క్రమంలోనే టీజర్​, పోస్టర్లు, పాటలు రిలీజ్​ చేసి.. అందుకు తగ్గ హైప్​ను పెంచారు మేకర్స్​.

    సాధారణంగా సుకుమార్​- అల్లు అర్జున్​ కాంబో అంటేనే ఏదో కొత్తదనం ఆశిస్తున్నారు ప్రేక్షకులు. ఆర్య, ఆర్య2 సినిమాల్లో బన్నీని కొత్తగా చూపించడమే అందుకు కారణం. మరోవైపు రంగస్థలంతో ఫుల్​ఫామ్​లోకి వచ్చి సుకుమార్​.. ఈ సినిమాతో మరో భారీ హిట్​ అందుకోవాలని బలంగా అనుకంటున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే  సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్​లో భాగంగా నిన్న జరిగిన ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను చాలా గ్రాండ్​గా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాజమౌళి, కొరటాల శివ, మారుతి వంటి పెద్ద దర్శకులను ఆహ్వానించారు. ఈ  సినిమాలో రష్మిక హీరోయిన్​గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈవెంట్​కు హాజరైన రష్మిక బ్లాక్​ శారీ​లో కుర్రకారుకు మెంటలెక్కించింది. కవ్వింపు చూపులతో.. క్యూట్​ ఎక్స్​ప్రెషన్స్​తో కెమెరా కళ్లకు చిక్కింది ఈ ముద్దుగుమ్మ.
    ప్రస్తుతం ఆమె ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి. కాగా, రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా తొలి భాగం పుష్ప ది రైజ్​ను డిసెంబరు 17న విడుదల చేయాలని నిర్ణయించారు. సునీల్​, అనసూయ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఎర్రచందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో ఈ కథ సాగనుందని తెలిసిందే.
    Tags