https://oktelugu.com/

HBD Victory Venkatesh: నైజాం రాజుగా ఎంట్రీ ఇచ్చిన వెంకీమామ.. స్పెషల్​ బర్త్​డే వీడియో రిలీజ్​

HBD Victory Venkatesh: కామెడీ, ఫ్యామిలీ ఎంటర్​టైనర్​కు కేరాఫ్ అడ్రస్​ విక్టరీ  వెంకటేశ్​. అభిమానులు ముద్దుగా వెంకీ మామ అని పిలుస్తుంటారు.  పాత్రేదైనా, డైలాగ్ ఎలా ఉన్నా.. తన మేనరిజంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న వ్యక్తి వెంకి. ఈ రోజు సీనియర్​ హీరో విక్టరీ వెంకటేశ్​ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ.. అభిమానులు, సెలబ్రిటీలు విషెష్​ చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వెంకీ మామకు విషెష్​ చెప్తూ.. ఏఫ్​3 […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 13, 2021 / 11:39 AM IST
    Follow us on

    HBD Victory Venkatesh: కామెడీ, ఫ్యామిలీ ఎంటర్​టైనర్​కు కేరాఫ్ అడ్రస్​ విక్టరీ  వెంకటేశ్​. అభిమానులు ముద్దుగా వెంకీ మామ అని పిలుస్తుంటారు.  పాత్రేదైనా, డైలాగ్ ఎలా ఉన్నా.. తన మేనరిజంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న వ్యక్తి వెంకి. ఈ రోజు సీనియర్​ హీరో విక్టరీ వెంకటేశ్​ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ.. అభిమానులు, సెలబ్రిటీలు విషెష్​ చెబుతున్నారు.

    ఈ క్రమంలోనే తాజాగా వెంకీ మామకు విషెష్​ చెప్తూ.. ఏఫ్​3 మేకర్స్ సరికొత్త వీడియోను విడుదల చేశారు. వెంకటేశ్ చుట్టూ ఉన్న వ్యక్తులతో చార్మినార్​ ముందు విశ్రాంతి తీసుకుంటూ కనిపించడంతో రాజులా ఎంట్రీ ఇచ్చాడు. హైదరాబాద్ సంస్కృతి కనిపించేలా ఈ లుక్​లో ప్రదర్శించారు. కాగా, వెంకటేశ్​ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఎఫ్​3, ఇందులో వరుణ్​ తేజ్​కూడా హీరోగా కనిపించనున్నారు. ఇందులో  తమన్న, మెహరిన్​ హీరోయిన్లుగా కనిపించున్నారు. అనిల్​ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సునీల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఈ సినిమా విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్​పై దిల్​రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్నారు.

    కాగా, 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్​2.. ప్రేక్షకుల మనసు దోచుకుంది. అందులో కామెడీతో నవ్వులు పూయిస్తూనే.. సెంటిమెంటల్​గా భార్య, భర్తల అనుబంధం గురించి చక్కగా వివరించారు. మరి ఈ సారి ఎలాంటి స్టోరీతో అనిల్​ రావిపుడి థియేటర్లలోకి అడుగుపెట్టనున్నారో తెలియాలంటే సినిమా విడుదలయ్యేంతవరకు వేచి చూడాల్సిందే.