https://oktelugu.com/

కేసీఆర్ ను ఇరుకునపెడుతున్న మంత్రులు..!

తెలంగాణలో కరోనా పంజా విసురుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో నమోదవుతున్న కేసులతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా నగరమంతా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో నగరవాసులు ఇళ్ల నుంచి బయటికి రావాలంటే ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అనే విమర్శలు ప్రజలు నుంచి వెల్లువెత్తుతోన్నాయి. ఇలాంటి సమయంలోనే ఉస్మానియా ఆస్పత్రికి వరద నీరురావడం సర్కారును మరింత ఇరుకున పెట్టింది. తెలంగాణలో ఇప్పటివరకు కేసీఆర్ ఆడిందే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 18, 2020 / 03:50 PM IST
    Follow us on


    తెలంగాణలో కరోనా పంజా విసురుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో నమోదవుతున్న కేసులతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా నగరమంతా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో నగరవాసులు ఇళ్ల నుంచి బయటికి రావాలంటే ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అనే విమర్శలు ప్రజలు నుంచి వెల్లువెత్తుతోన్నాయి. ఇలాంటి సమయంలోనే ఉస్మానియా ఆస్పత్రికి వరద నీరురావడం సర్కారును మరింత ఇరుకున పెట్టింది.

    తెలంగాణలో ఇప్పటివరకు కేసీఆర్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది. అయితే కరోనా ఎంట్రీ తర్వాత పరిస్థితులన్నీ కేసీఆర్ కు వ్యతిరేకంగా మారుతోన్నాయి. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమవడం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. దీంతో సర్కార్ పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయలో విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనికితోడు సీఎం అధికారిక నివాసంలో కరోనా సోకగా కేసీఆర్ కొద్దిరోజులు కన్పించకుండా పోవడంపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేశాయి. కరోనా వేళ కేసీఆర్ హైదరాబాద్లో ఉండకుండా ఎర్రవెల్లిలోని తన ఫౌంహౌజ్ లో ఉండటం ఏంటని ప్రశ్నించాయి.

    కరోనా వేళ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు?

    మరోవైపు సచివాలయం కూల్చివేతలోనూ టీఆర్ఎస్ సర్కార్ అప్రతిష్ట పాలైంది. కోవిడ్-19 ఆస్పత్రిగా సచివాలయాన్ని మార్చాలని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు చేసిన డిమాండ్లు సీఎం కేసీఆర్ పెడచెవిన పెట్టి కూల్చివేతకే మొగ్గుచూపారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నియంతగా వ్యవహరిస్తున్నారనే భావనను ప్రతిపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఇలాంటి తరుణంలో ఇటీవల ఉస్మానియా ఆస్పత్రిలోకి వరదనీరు రావడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. ఇన్నాళ్లలో ఉస్మానియాలోకి రాని వరదనీరు ఇప్పుడేలా వచ్చిందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యానికి ఉస్మానియాలోకి వరదనీరు రావడమే ఇందుకు నిదర్శనమని ఆరోపణలు గుప్పించాయి.

    అయితే పరిస్థితి చక్కదిద్దాల్సిన కొందరు మంత్రులు సీఎం కేసీఆర్ ను ఇరుకునపెట్టేలా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు నేపథ్యంలో ఉస్మానియా సందర్శించిన పలువురు మంత్రులు ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడం విమర్శలకు తావిస్తోంది. వరదపై మున్సిపల్ మంత్రి స్పందించాల్సి ఉండగా దీంతో ఏమాత్రం సంబంధంలేని మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్ అవగాహన రహిత్యంతో మాట్లాడటం ప్రతిపక్షాలకు వరంలా మారింది. ప్రభుత్వం చేతగానీతనంలో ఎదురుదాడికి దిగుతుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

    మందుబాబులు బేజారు…అక్రమార్కులు హుషారు..!

    ఇక వివాదస్పదాలకు దూరంగా మంత్రి ఈటల రాజేందర్ సైతం ఉస్మానియా ఆస్పత్రి విషయంలో చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మారాయి. ఉస్మానియాను కూలగొట్టి కడతామంటే విపక్షాలు అడ్డుకున్నాయని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను హస్యాస్పదంగా ఉన్నాయంటూ విపక్షాలు ఎద్దేవా చేశాయి. ఉస్మానియాలో వరదనీరు వచ్చిన వెంటనే సహాయ చర్యలు చేపట్టకుండా మంత్రులు ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడంతో సీఎం బాదనామ్ కావాల్సి వచ్చింది.

    ఈ విషయంలో ప్రభుత్వాన్ని మంత్రులే అప్రతిష్టపాలు చేశారని సీఎం కేసీఆర్ సీరియస్ అవుతున్నారట. మరోవైపు గాంధీలోనూ ఉద్యోగులు సమ్మె చేస్తూ ప్రభుత్వాన్ని బాదనం చేస్తున్నారని దీనికంతటికి మంత్రుల వ్యవహరమే కారణమనే భావనలో సీఎం ఉన్నారట. దీంతో ఎవరి శాఖకు సంబంధించిన విషయంలో వారే స్పందించాలని సీఎం ఆదేశించినట్లు టాక్ విన్పిస్తుంది.