https://oktelugu.com/

కమల్‌ హాసన్‌ మరో ప్రయోగం..

కమల్‌ హాసన్. లెజెండరీ యాక్టర్. నటన ఒక్కటే కాదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సినిమా విషయంలో ఆయన ఆల్‌రౌండర్. మంచి రైటర్, డైరెక్టర్, డ్యాన్సర్ కూడా. అంతేకాదు గొప్ప సాంకేతిక నిపుణుడు కూడా. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలను భారత సినీ పరిశ్రమకు పరిచయం చేయడంలో ముందుంటారు. ప్రపంచ సినిమాలో జరిగే మార్పులను పరిశీలిస్తుంటారు. కొత్త టెక్నాలిజీ వచ్చిందంటే చాలు దాన్ని అధ్యయనం చేసి అందుకు తగ్గట్టు తనని మార్చుకుంటాడు. అందుకే కమల్‌ను నిత్య విద్యార్థి అంటుంటారు. మేకప్‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 18, 2020 / 03:35 PM IST
    Follow us on


    కమల్‌ హాసన్. లెజెండరీ యాక్టర్. నటన ఒక్కటే కాదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సినిమా విషయంలో ఆయన ఆల్‌రౌండర్. మంచి రైటర్, డైరెక్టర్, డ్యాన్సర్ కూడా. అంతేకాదు గొప్ప సాంకేతిక నిపుణుడు కూడా. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలను భారత సినీ పరిశ్రమకు పరిచయం చేయడంలో ముందుంటారు. ప్రపంచ సినిమాలో జరిగే మార్పులను పరిశీలిస్తుంటారు. కొత్త టెక్నాలిజీ వచ్చిందంటే చాలు దాన్ని అధ్యయనం చేసి అందుకు తగ్గట్టు తనని మార్చుకుంటాడు. అందుకే కమల్‌ను నిత్య విద్యార్థి అంటుంటారు. మేకప్‌ నుంచి డిజిటల్‌ సౌండ్‌ వరకూ చాలా కొత్త టెక్నిక్స్‌ను భారత సినిమాకు పరిచయం చేశాడు. లాక్‌డౌన్‌ దెబ్బకు తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఇప్పుడంతా ఓటీటీల శరణుగోరుతున్నారు గానీ.. కొన్నేళ్ల క్రితమే కమల్‌ డిజిటల్‌ ప్లాట్ఫ్లామ్‌ భవిష్యత్తును అంచనా వేశారు. విశ్వరూపం సినిమాను డిటీహెచ్‌ రూపంలో పరిచయం చేశారు. అప్పుడు కమల్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించిన నిర్మాతలే ఇప్పుడు ఓటీటీలను కీర్తిస్తూ వాటి బాట పడుతున్నారు.

    సినిమా వాళ్లకు ఒక పీడకల !

    చిత్ర పరిశ్రమకు ఎన్నో కొత్త విషయాలను పరిచయం చేసిన కమల్‌ హానన్‌ ఇప్పుడు మరో నూతన ఆవిష్కరణతో ముందుకు రాబోతున్నాడు. ఓ కొత్త రకం స్క్రీన్‌ ‌ప్లేను ఆయన తెరకు పరిచయం బోతున్నారట. లాక్‌డౌన్‌ సమయాన్ని దాని కోసమే వెచ్చిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ తరహా స్క్రీన్ ప్లేతో స్క్రిప్ట్‌ కూడా రెడీ చేశాడని సమాచారం. కరోనా పరిస్థితుల్లో సినిమాలకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితులకు అనువుగా ఓటీటీ రిలీజ్‌ను దృష్టిలో ఉంచుకొని తక్కువ మంది నటీనటులు, టెక్నీషియన్స్‌ సహాయంతో మూవీ తీసేలా కమల్‌ న్యూ స్క్రిప్ట్‌ డిజైన్‌ చేశారట. తమిళనాడులో లాక్‌డౌన్‌ ఎత్తేయగానే షూటింగ్‌ స్టార్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ కొత్త రకం స్క్రిప్టుతో తీసే ప్రయోగాత్మక మూవీలో కమల్‌ నటిస్తాడా? లేక డైరెక్షన్‌ చేస్తాడా? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కమల్‌ ప్రస్తుతం శంకర్ తో కలిసి ప్రెస్టీజియస్‌ ‘ఇండియన్‌ 2’లో నటిస్తున్నాడు. అది పూర్తయిన తర్వాత రజినీకాంత్‌తో ఓ మూవీ చేస్తాడని సమాచారం.