https://oktelugu.com/

కాజల్‌, బెల్లకొండ శ్రీను మధ్య ఏముందబ్బా!

లక్ష్మీ కళ్యాణంతో టాలీవుడ్‌కు పరిచయమై షార్ట్‌ టైమ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది కాజల్‌ అగర్వాల్‌. తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలో కూడా ఆమె మంచి పేరు సంపాదించుకుంది. కుర్ర హీరోలతో పాటు పెద్ద హీరోల సరసన కూడా నటించింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో రెండో సినిమా కూడా చేస్తోందామె. వయసు మీదపడుతున్నా… వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కాజల్‌ గురించి రోజుకో పుకారు వినిపిస్తోంది. ఇప్పటికే చెల్లి నిషా అగర్వాల్‌కు పెళ్లయింది. ఒక బిడ్డకు జన్మకూడా ఇచ్చింది. దాంతో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 18, 2020 / 04:09 PM IST
    Follow us on


    లక్ష్మీ కళ్యాణంతో టాలీవుడ్‌కు పరిచయమై షార్ట్‌ టైమ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది కాజల్‌ అగర్వాల్‌. తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలో కూడా ఆమె మంచి పేరు సంపాదించుకుంది. కుర్ర హీరోలతో పాటు పెద్ద హీరోల సరసన కూడా నటించింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో రెండో సినిమా కూడా చేస్తోందామె. వయసు మీదపడుతున్నా… వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కాజల్‌ గురించి రోజుకో పుకారు వినిపిస్తోంది. ఇప్పటికే చెల్లి నిషా అగర్వాల్‌కు పెళ్లయింది. ఒక బిడ్డకు జన్మకూడా ఇచ్చింది. దాంతో కాజల్‌ కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు వస్తున్నాయి. ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో చాన్నాళ్ల నుంచి ప్రేమలో ఉందని, అతడినే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం కాబోతోందంటూ ప్రచారం జరిగింది. కానీ, ‘ఆచార్య’ సహా పలు కొత్త సినిమాలకు సైన్‌ చేయడంతో అవన్నీ పుకార్లే అని ఆమె ఫ్యాన్స్‌ అంటున్నారు.

    పూజా హెగ్డేతో అక్కినేని హీరో డేటింగ్ !

    అయితే, పెళ్లి విషయం పక్కనబెడితే ప్రస్తుతం కాజల్‌ ప్రేమలో ఉందన్నది మాత్రం నిజమేనట. ఆమె పీకల్లోతు ప్రేమలో మునిగింది టాలీవుడ్‌ కుర్ర హీరోతో అని ఈ మధ్య ప్రచారం జోరందుకుంది. ఆ కుర్ర హీరో మరెవరో కాదు బెల్లకొండ శ్రీనివాస్‌ అట. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ రద్దవడంతో ఖాళీగా ఉన్న టైమ్‌లో రీసెంట్‌గా సోషల్‌ మీడియా వేదికగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అందుకు బలం చేకూరుస్తోంది. కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ ఇద్దరూ కలిసి ‘కవచం’, ‘సీత’ సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మంచి ప్రెండ్‌షిప్‌ కుదిరింది. అది కాస్త ముదిరి ప్రేమకు దారితీసిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే షూటింగ్‌ సమయంలోని తమ ఇద్దరి కోజ్‌ ఫొటోని పోస్ట్‌ చేసిన కాజల్‌.. ‘నిన్ను పిచ్చిపిచ్చిగా మిస్‌ అవుతున్నా (మిస్‌ యూ నట్‌కేస్‌) . తొందర్లోనే కలుస్తా ’ అని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

    వన్‌ అండ్‌ ఓన్లీ విజయ్ దేవరకొండ

    ఇక కాజల్ అగర్వాల్ అంత ప్రేమగా మిస్ యూ అని చెప్పేసరికి బెల్లంకొండ కరిగిపోయాడు. ‘నైనేతే ఇంకా మిస్‌ అవుతున్నా. కానీ, కలవడానికి వీలు లేని పరిస్థితుల్లో ఇంకా మిస్‌ అవుతున్నానని చెప్పకు’ అని పోస్ట్‌ చేశాడు.ఈ పోస్టులు ఇప్పుడు నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఇద్దరి ప్రెండ్‌షిప్‌ నెక్ట్స్‌ లెవెల్‌కు వెళ్లిందని, ప్రేమ కూడా చిగురించిందన్న రూమర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారు… అంటూ నెట్‌లో కామెంట్లు వస్తున్నాయి. అయితే, త్వరలో కలుద్దాం అని కాజల్‌ అనడాన్ని బట్టి వీరిద్దరూ మరోసారి కలిసి నటించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. శ్రీనివాస్‌ ప్రస్తుతం ‘అల్లుడు అదుర్స్‌’ అనే మూవీ చేస్తున్నాడు.