https://oktelugu.com/

సీఎంపై అసంతృప్తి గళం విప్పుతున్న నేతలు..!

తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో సీఎం కేసీఆర్ పై ఆ పార్టీలోని అసంతృప్తి నేతలు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఫలితాలతో టీఆర్ఎస్ నేతల్లోనూ మార్పు వచ్చినట్లు స్పష్టంగా కన్పిస్తోంది. Also Read: జనాలకు కరెంట్ బంద్ చేస్తేనే టీఆర్ఎస్ విలువ తెలుస్తుందట! ఇన్నిరోజులుగా సీఎం కేసీఆర్ కు ఎదురు మాట్లాడేందుకు భయపడే నేతలు ఒక్కొక్కరుగా నిరసన గళం విన్పిస్తున్నారు. తాజాగా భద్రచాలం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సీఎం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 15, 2020 / 05:32 PM IST
    Follow us on

    తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో సీఎం కేసీఆర్ పై ఆ పార్టీలోని అసంతృప్తి నేతలు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఫలితాలతో టీఆర్ఎస్ నేతల్లోనూ మార్పు వచ్చినట్లు స్పష్టంగా కన్పిస్తోంది.

    Also Read: జనాలకు కరెంట్ బంద్ చేస్తేనే టీఆర్ఎస్ విలువ తెలుస్తుందట!

    ఇన్నిరోజులుగా సీఎం కేసీఆర్ కు ఎదురు మాట్లాడేందుకు భయపడే నేతలు ఒక్కొక్కరుగా నిరసన గళం విన్పిస్తున్నారు. తాజాగా భద్రచాలం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సీఎం కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు.

    గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన రేగా కాంతారావు ఆ తర్వాత పలు కారణాలతో టీఆర్ఎస్ లో చేరారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదివాసీల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇస్తేనే టీఆర్ఎస్ చేరినట్లు చెప్పారు.

    Also Read: టీఆర్ఎస్ కు షాక్: బీజేపీలోకి మంత్రి సోదరుడు?

    ఆదివాసీలపై ఫారెస్టు అధికారులు దాడులు చేయద్దని సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. అయినప్పటికీ వారిపై దాడులు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారెస్టు భూములపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    ఫారెస్టు అధికారుల దాడుల వల్ల ఆదివాసీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు పెద్దఎత్తున నష్టం జరుగుతుందని హెచ్చరించారు. పోడు ఉద్యమంలో భాగంగా త్వరలోనే ప్రభుత్వంతో సంప్రదింపులు చేయనున్నట్లు ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్