https://oktelugu.com/

నటి ఆత్మహత్య కేసులో నేరస్థుడు అతనే !

కొంతమంది నటీమణులు కెరీర్ బాగున్నా.. మానసిక ఒత్తిడి కారణంగా.. అకారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన దురదృష్ట సంఘటనలు ఇప్పటికే ఎంతోమంది జీవితాల్లో చూశాము. అలాంటి బాధ కలిగించే సంఘటనే… బుల్లితెర నటి వీజే చిత్ర ఆత్మహత్య సంఘటన కూడా. అయితే ఆమె ఆత్మహత్య కేసులో ఆమె భర్త హేమంత్‌ రవిని పోలీసులు అరెస్టు చేయడంతో మొత్తానికి ఆమె ఆత్మహత్య వెనుక ఉన్న వ్యక్తి ఎవరన్నది క్లారిటీ వచ్చేసింది. Also Read: రోజా కొత్త బిజినెస్.. యూత్ […]

Written By:
  • admin
  • , Updated On : December 15, 2020 / 04:26 PM IST
    Follow us on


    కొంతమంది నటీమణులు కెరీర్ బాగున్నా.. మానసిక ఒత్తిడి కారణంగా.. అకారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన దురదృష్ట సంఘటనలు ఇప్పటికే ఎంతోమంది జీవితాల్లో చూశాము. అలాంటి బాధ కలిగించే సంఘటనే… బుల్లితెర నటి వీజే చిత్ర ఆత్మహత్య సంఘటన కూడా. అయితే ఆమె ఆత్మహత్య కేసులో ఆమె భర్త హేమంత్‌ రవిని పోలీసులు అరెస్టు చేయడంతో మొత్తానికి ఆమె ఆత్మహత్య వెనుక ఉన్న వ్యక్తి ఎవరన్నది క్లారిటీ వచ్చేసింది.

    Also Read: రోజా కొత్త బిజినెస్.. యూత్ కోసమే !

    చిత్ర ఈ నెల 9వ తేదీన చెన్నైలోని నజరత్‌ పేట్టైలో ఉన్న ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ షాక్ కి గురయ్యారు. మంచి నటి.. పైగా అవకాశాలు బాగున్నాయి. మరి ఎందుకు ? ఆమె ఇలా చేసింది ? అంటూ ఆమెను అభిమానించినవారు సోషల్ మీడియాలో పలు ప్రశ్నలతో పోలీసులను ట్యాగ్ చేశారు. పైగా ఈ ఘటన పై ఆమె తల్లిదండ్రుల కూడా ఫిర్యాదు చేసారు. అలా కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిత్ర భర్తతో పాటు ఆమె సహనటులను, అలాగే స్నేహితుల అందర్నీ విచారించి మొత్తానికి అసలు నేరస్థుడ్ని పట్టుకున్నారు.

    Also Read: అవి రావనుకునే పెళ్లికి సిద్ధ‌పడ్డాను – సమంత

    నిజానికి తమ కూతురిని అల్లుడే కొట్టి చంపేశాడని చిత్ర తల్లి విజయ ఆరోపించడం.. పోలీసుల విచారణలోనూ అదే నిజం అని తేలడంతో మొత్తానికి చిత్ర భర్త బుక్ అయ్యాడు. ఓ సీరియల్‌లోని కొన్ని దృశ్యాల వల్ల భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, అదే చిత్ర ఆత్మహత్యకు దారితీసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే పోస్టుమార్టం నివేదికలో చిత్ర ఆత్మహత్య చేసుకున్నట్లు నిద్ధారణ అయింది. కాకపోతే ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆమె భర్త పై పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్