ప్చ్.. వంద మిలియన్ల కోసం ‘పుష్ప’ ఆరాటం !

అల్లు అర్జున్ కి పుట్టిన పాన్ ఇండియా సినిమా చేయాలనే కోరిక కారణంగా ‘పుష్ప’కి బడ్జెట్ ను పెంచి, రెండు భాగాలుగా విడదీశారు. ఎట్టిపరిస్థితుల్లో పుష్ప మొదటి భాగాన్ని ఈ ఏడాదే విడుదల చెయ్యాలనేది దర్శకనిర్మాతల గట్టి ప్రయత్నం. కాకపోతే కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఏ భారీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పుడే ఓ అంచనాకి రాలేని పరిస్థితి. దాంతో పుష్పకి డేట్ ఎప్పుడు కుదురుతుంది, సోలో రిలీజ్ కి స్కోప్ ఉందా అనే […]

Written By: admin, Updated On : June 5, 2021 1:28 pm
Follow us on

అల్లు అర్జున్ కి పుట్టిన పాన్ ఇండియా సినిమా చేయాలనే కోరిక కారణంగా ‘పుష్ప’కి బడ్జెట్ ను పెంచి, రెండు భాగాలుగా విడదీశారు. ఎట్టిపరిస్థితుల్లో పుష్ప మొదటి భాగాన్ని ఈ ఏడాదే విడుదల చెయ్యాలనేది దర్శకనిర్మాతల గట్టి ప్రయత్నం. కాకపోతే కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఏ భారీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పుడే ఓ అంచనాకి రాలేని పరిస్థితి.

దాంతో పుష్పకి డేట్ ఎప్పుడు కుదురుతుంది, సోలో రిలీజ్ కి స్కోప్ ఉందా అనే ఆలోచనల్లో దర్శకుడు సుకుమార్, నిర్మాతలు ఉన్నారు. సుకుమార్ కి, అలాగే బన్నీకి కూడా పాన్ ఇండియా ఇమేజ్ లేదు. కానీ ఈ మూవీ బడ్జెట్ ను మాత్రం నేషనల్ సినిమా రేంజ్ లో పెడుతున్నారు. ఎంత రెండు భాగాలుగా తీసినా సినిమాకి ఇతర భాషల్లో ఓపెనింగ్స్ రావాలి కదా.

నిర్మాత ప్రొడక్షన్ కాస్ట్ పెంచినంత సులభంగా కలెక్షన్స్ ను పెంచలేరు కదా. అయితే, బన్నీ టీం ఆలోచనల ప్రకారం పుష్ప సినిమాని నేషనల్ లెవల్లో బాగా ప్రొమోషన్ చేయాలని, అందుకే ఇప్పటినుండే పక్కా ప్లాన్స్ తో ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. కానీ, లోకల్ భాషలో వర్కౌట్ అయ్యే ప్రమోషన్స్, నేషనల్ వైడ్ గా వర్కౌట్ అవ్వవు.

ఇవేమి పట్టని సినిమా టీమ్ మాత్రం ఈ సినిమా టీజర్ కి 100 మిలియన్ల వ్యూస్ వచ్చేలా టార్గెట్ పెట్టుకుని పెయిడ్ ప్రమోషన్స్ చేయిస్తున్నారు. ముప్పై మిలియన్ల దగ్గర ఆగిపోయిన టీజర్ ను, ఖర్చు పెట్టి ఆల్ రెడీ 70 మిలియన్లకు తీసుకువచ్చారు. ఇప్పుడు ఇంకా ఖర్చు పెట్టి 100 మిలియన్ల దగ్గర తీసుకువెళ్తారట. తెలుగులో వంద మిలియన్ల మార్క్ ను అందుకున్న మొట్ట మొదటి టీజర్ ఇదే అవుతుంది.

అప్పుడు చక్కగా ‘అల్లు అర్జున్ బాబు’ స్టిల్ మీద వంద మిలియన్లను సాధించిన ఏకైక హీరో అని, ఇక ఈయనే నిజమైన పాన్ ఇండియా స్టార్ అని పోస్టర్స్ వదులుతారు. ఇలాంటి పోస్టర్స్ ను వండించి వడ్డించడంలో అల్లు అరవింద్ గారికి ముప్పై ఏళ్ల అనుభవం ఉంది. కానీ, ఆ అనుభవం పబ్లిసిటీకి పనికొస్తోందేమో గానీ, రికార్డ్స్ క్రియేట్ చేయడానికి కాదు, మరి చూడాలి పుష్ప ఏ తీరం చేరుతుందో చివరకు.