వైఎస్ ను తిడుతున్నా పట్టించుకోరా?

తెలంగాణ టీఆర్ఎస్ నేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఇష్టారాజ్యంగా దూషిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేతలు మాత్రం స్పందించడం లేదు. ఏమీ మాట్లాడడం లేదు. దీంతో తెలంగాణ నేతలు రెచ్చిపోతున్నారు. అయినా వారిలో చలనం లేకుండా పోతోంది. అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చే వరకు నిశ్శబ్దం పాటించాల్సిందేనని చెబుతున్నారు. ఇన్నాళ్లు టీడీపీని బండ బూతులు తిట్టిన నేతలు ఈ విషయంలో ఎందుకు కామ్ గా ఉంటున్నారో అర్థం కావడం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. వైసీపీలో స్పెషలిస్టులుగా […]

Written By: Srinivas, Updated On : June 29, 2021 8:36 pm
Follow us on

తెలంగాణ టీఆర్ఎస్ నేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఇష్టారాజ్యంగా దూషిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేతలు మాత్రం స్పందించడం లేదు. ఏమీ మాట్లాడడం లేదు. దీంతో తెలంగాణ నేతలు రెచ్చిపోతున్నారు. అయినా వారిలో చలనం లేకుండా పోతోంది. అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చే వరకు నిశ్శబ్దం పాటించాల్సిందేనని చెబుతున్నారు.

ఇన్నాళ్లు టీడీపీని బండ బూతులు తిట్టిన నేతలు ఈ విషయంలో ఎందుకు కామ్ గా ఉంటున్నారో అర్థం కావడం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. వైసీపీలో స్పెషలిస్టులుగా పేరు తెచ్చుకున్న కొడాలి నాని, అనిల్ కుమార్ సైతం సంయమనం పాటించడం గమనార్హం. వైసీపీలో అధిష్టానం చెబితేనే మాట్లాడాలి. వారు మాట్లాడినట్లు మేం మాట్లాడగలం కానీ మాకు సంకేతాలు వస్తేనే తప్ప చేయలేమని చెబుతున్నారు.

కేసీఆర్ వైఎస్ ను విమర్శించినట్లుగా విమర్శిస్తే ఏదో అయిపోతుందని ఆందోళన చెందుతున్నారు. అధిష్టానం ఆదేశం లేనిదే ఏమీ మాట్లాడలేమని చెబుతున్నారు. సీఎం జగన్ దృష్టికి మంత్రుల ప్రకటనలు వెళుతున్నాయో లేదో కాని ఆయన వైపు నుంచి స్పందన కనిపించడం లేదు. టీఆర్ఎస్ నేతలు మరింత దూకుడు పెంచారు. వైసీపీ స్పందన లేకపోవడంతో వైఎస్ అభిమానులతోపాటు సాధారణ కార్యకర్తల్లోనూ అసంతృప్తి రగులుతోంది.

తమనేతను బూతులు తిడుతున్నా కనీసం కౌంటర్ ఇవ్వకపోవడం ఎలాగని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు తిడుతున్న తిట్లకు వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇదెక్కడి కర్మరా బాబూ అంటూ లబోదిబోమంటున్నారు. వైసీపీ స్పందన లేకపోవడంతో ఇక ఏం చేసేదని ప్రశ్నిస్తున్నారు. తమ మనుగడకే ప్రమాదం పొంచి ఉందని కార్యకర్తలు పేర్కొన్నారు.