https://oktelugu.com/

కాలేజీలో బాలయ్య ఎమోషనల్ డ్రామా !

బాలయ్యతో మరో సినిమా చేయాలని సి.కె ఎంటర్టైన్మెంట్స్ అధినేత సి.కళ్యాణ్ ఎప్పటి నుండో ప్లాన్ చేస్తున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లట్లేదు. అలాగే, బాలయ్య వైపు నుండి కూడా చిన్నపాటి అహం అడ్డు వచ్చి సి.కళ్యాణ్ కి డేట్స్ పై క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి బాలయ్యకు తత్త్వం బోధ పడి.. తానూ ఎలాంటి సినిమాలు చేస్తే జనం ఆదరిస్తారో బాలయ్యకి అర్ధం అయినట్టు ఉంది. అందుకే తనకు సూట్ అయ్యే […]

Written By:
  • admin
  • , Updated On : June 28, 2021 / 06:44 PM IST
    Follow us on

    బాలయ్యతో మరో సినిమా చేయాలని సి.కె ఎంటర్టైన్మెంట్స్ అధినేత సి.కళ్యాణ్ ఎప్పటి నుండో ప్లాన్ చేస్తున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లట్లేదు. అలాగే, బాలయ్య వైపు నుండి కూడా చిన్నపాటి అహం అడ్డు వచ్చి సి.కళ్యాణ్ కి డేట్స్ పై క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి బాలయ్యకు తత్త్వం బోధ పడి.. తానూ ఎలాంటి సినిమాలు చేస్తే జనం ఆదరిస్తారో బాలయ్యకి అర్ధం అయినట్టు ఉంది.

    అందుకే తనకు సూట్ అయ్యే కథలు తీసుకువస్తే సినిమా చేద్దాం అంటూ సి.కళ్యాణ్ కి ఒక మెసేజ్ పాస్ చేశాడు. కాగా కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఓ సరికొత్త సినిమా చేయడానికి సి. కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నాడు. బాలయ్యతో మంచి ఎమోషనల్ డ్రామాను కాలేజీ నేపథ్యంలో చేయాలని కళ్యాణ్ ప్లాన్ లో భాగం. అందుకోసం దర్శకుడు సంపత్ నందిని కథ తయారు చేయమని చెప్పినట్లు తెలుస్తోంది.

    సంపత్ నంది ప్రస్తుతం గోపీచంద్ తో చేస్తున్న సిటీమార్ సినిమా వర్క్ మొత్తం పూర్తి అయింది. కాబట్టి, ప్రజెంట్ బాలయ్య కథ మీద కూర్చున్నాడట. అయితే, సపంత్ నందికి ఎక్కువగా రొటీన్ కొట్టుడు యాక్షన్ అండ్ లవ్ స్టోరీలు తీసి విసిగించడం అలవాటు. మరి అలాంటి సపంత్ నంది నుండి గొప్ప ఎమోషనల్ డ్రామా అంటే.. అదీ క్లాసిక్ అంటే డౌటే.

    మరి ఈ కాంబినేషన్ ను అసలు ఎంతవరకు నమ్మవచ్చు అనేది సి.కళ్యాణ్ కే తెలియాలి. ఏది ఏమైనా బాలయ్యకు సి కళ్యాణ్ ఆస్థాన నిర్మాతగా మారిపోయాడు. జైసింహా లాంటి ప్లాప్ సినిమా ఇచ్చినా.. బాలయ్య కాంపౌండ్ లో ఇంకా సి.కళ్యాణ్ కి ప్రత్యేక స్థానం ఉండటం నిజంగా విశేషమే. మరోపక్క బాలయ్యకు సరిపడా కథను వండే ప్రయత్నాల్లో వినాయక్ కూడా ఉన్నాడట. మరి చివరకు బాలయ్య ఎవరితో సినిమా చేస్తాడో చూడాలి.