Telangana Politics: రాజకీయాల్లో కొనసాగాలంటే పదవులు తప్పనిసరి. చిన్నదా పెద్దదా అని కాదు. ఏదో ఒక పదవి లేకపోతే ప్రశాంతంగా నిద్రపోలేరు. ఇప్పుడు టీఆర్ ఎస్‌లో చాలామంది కీలక నేతలు ఇలాగే సతమతమవుతున్నారు. గతంలో ఓడిపోయిన తమకు మరోసారి అవకాశం రాదని, ఎందుకంటే తమ మీద గెలిచిన వారిని టీఆర్ ఎస్‌లోకి తీసుకురావడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమనే సంకేతాలు వినిపిస్తుండటంతో.. ఇప్పటి నుంచే కొత్త దారిని వెతుక్కుంటున్నారు.

దీంతో రహస్య భేటీలకు తెరతీయడం పార్టీలో సంచలనం రేపుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి జూపల్లి కృష్నారావు ఇందులో కీలకంగా కనిపిస్తున్నారు. ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు. కానీ గత ఎన్నికల్లో ఓడిపోవడంతో టీఆర్ ఎస్‌లో అసంతృప్తిగా ఉంటున్నారు. పైగా తన మీద గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థిని టీఆర్ ఎస్‌లో చేర్చుకున్నారు.
Also Read: రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు..? వైసీపీ, బీజేడీతో బీజేపీ మంతనాలు?
అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. అయితే పార్టీ అధిష్టానంకు మాత్రం కృష్ణారావు గ్రూపు రాజకీయాలు చేస్తున్నారనే అపవాదు ఉంది. అందుకే ఆయన్ను పక్కన పెడుతున్నారు. కృష్ణారావుకు మరోసారి టికెట్ వస్తుందనే నమ్మకం లేదు. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా సొంత వర్గాన్ని ఇండిపెండెంట్ గా పోటీ చేయించి గెలిపించుకున్నారు. ఇలా ఆయన క్రమ క్రమంగా పార్టీలో పట్టు కోల్పోయారు.
అటు వైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా ఇలాగే అసంతృప్తిలో ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ వస్తుందని ఆశించారు కానీ రాలేదు. పైగా తన మీద గెలిచిన ఉపేంద్ర రెడ్డిని టీఆర్ ఎస్ లోకి తీసుకున్నారు. దాంతో ఆయనకు మరోసారి టికెట్ వస్తుందనే నమ్మకం లేదు. అటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇదే అసంతృప్తితో ఉన్నారు. అయితే వీరంతా బీజేపీలోకి వెళ్తారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.

కానీ వారు మాత్రం ఎలాంటి స్పందన చేయలేదు. ఇన్ని రోజులు ఏదో ఒక ఆశ వస్తుందని అనుకున్నారు. కానీ ఆ ఆశలు అడియాశలు కావడంతో.. వీరు ముగ్గురూ కలిసి మొన్న ఖమ్మంలో రహస్యంగా భేటీ అయ్యారు. మూకుమ్మడిగా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. కాగా వీరి ప్రత్యర్థులు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. కాబట్టి అందులోకి వెళ్తే వారికి ఇబ్బందులు తప్పవు.
కానీ వారి అనుచర గణం మాత్రం వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి టీఆర్ ఎస్ ఇలాంటి కీలక నేతలను వదులుకుంటుందా అంటే వదులుకోదు. మరి ఈ అసంతృప్తులను కేసీఆర్ ఎలా బుజ్జగిస్తారనేది వేచి చూడాలి.
Also Read: రెడ్డిలు, కమ్మలకు వేలకోట్లు.. కాపులకు పిసిరంత? జగన్ కు కాపులు అవసరం లేదా?