TRS Leader: అధికార టీఆర్ఎస్ పార్టీ నేత ఆ పార్టీ వర్గాల్లో కల కలం రేపుతోంది. ఈ దారుణ హత్య సంగారెడ్డి జిల్లాలో జరిగింది. జిల్లాలోని పటాన్చెరు బీడీఎల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు టీఆర్ఎస్ మండల ఎస్టీ సెల్ ప్రెసిడెంట్, స్థిరాస్తి వ్యాపారిగా గుర్తించారు పోలీసులు. మృతుడి పేరు రాజు నాయక్ (36) కాగా, హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

జిల్లాలోని వెలిమెల తండాకు చెందిన కడావత్ రాజునాయక్ ఈ నెల 26న కనిపించకుండా పోయారు. దాంతో ఆయన కుటుంబసభ్యులు బీడీఎల్ పోలీసు స్టేషన్‌లో కంప్లయింట్ చేశారు.
చేశారు. ఈ నెల 27న పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, శనివారం ఉదయం సమయంలో పోలీసులకు ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు సమాచారం అందింది. దాంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇంద్రకరణ్ ప్రాంత పరిసరాల్లో వ్యక్తిని హత్య చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు.
మృతుడి తల భాగాన్ని రాయికోడ్ మండలంలోని కుసునుర్ గ్రామ శివారులో పడేశారు. న్యాకల్ మండలం రాఘపూర్ గ్రామ శివారులోని మంజీరా బ్రిడ్జ్ పరిసరాల్లో మొండెంను పడేసి వెళ్లారు. పోలీసులు రెండు ఘటనా ప్రదేశాలకు చేరకుని అక్కడి నుంచి బాడీని స్వాధీనం చేసుకున్నారు.
స్థానికంగా ఈ దారుణ హత్య కలకలం రేపుతోంది. స్థానికులు మృతుడి శరీర భాగాలను వేర్వేరు చేసి చంపడం చూసి భయాందోళన చెందుతున్నారు.
కేసు విచారణలో పురోగతి సాధించిన పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో మృతుని తమ్ముడు గోపాల్ నాయక్ ఉండటం గమనార్హం. మృతుడు రాజుతో భూమి విషయమై విభేదాలున్న రాంసింగ్, మహేశ్, బాలు, మల్లేశ్ తదితరులు కలిసి వ్యక్తిని హత్య చేసినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 32 గుంటల భూమి కోసం గతంలో కడవత్ రాజు నాయక్, రాంసింగ్ నాయక్ మధ్య పలుమార్లు గొడవలు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతునికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గతంలో అనగా 1990లో కూడా రాజు నాయక్ తండ్రి బుదేరా శివారులో హత్యకు గురైనట్లు సమాచారం.