TRS Joins Hands With Congress: బీజేపీ రాష్టపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా కూడా ఇవాళ నామినేషన్ వేసి తన ప్రచారం కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. యశ్వంత్ సిన్హాను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చింది. దీనికి టీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చి నామినేషన్ కార్యక్రమానికి సైతం హాజరయింది. దీంతో టీఆర్ఎస్ బీజేపీయేతర పక్షాల తరఫున ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే యశ్వంత్ సిన్హా వెంట నడవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

బీజేపీపై కోపంతో మూడో కూటమి ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి కొలిక్కి రావడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి టీఆర్ఎస్ మద్దతు ఇస్తూ బీజేపీని ఢీకొనాలని చూస్తున్నా అది సాధ్యం కాదని తెలుస్తోంది. బీజేపీకి ఉన్న బలం దృష్ట్యా విపక్షాల అభ్యర్థికి విజయం దక్కడం అంత సులువు కాదనే విషయం అర్థమవుతున్నా ఏదో చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ వ్యవహరించడం వివాదాలకు తావిస్తోంది.
Also Read: Negative talk For Megastar Movie: సినిమా మొదలు కాకముందే మెగాస్టార్ సినిమాకి నెగిటివ్ టాక్ !
దేశంలో మూడో కూటమి ఏర్పాటు చేసి బీజేపీ ఆధిపత్యాన్ని తగ్గించాలని భావిస్తున్నా అది అంత సులువు కాదనే విషయం తెలిసినా టీఆర్ఎస్ మాత్రం తన ప్రయత్నాలు మానుకోవడం లేదు. బీజేపీయేతర పక్షాలను ఏకం చేయడం చిన్న విషయం కాదు. అది కాంగ్రెస్ తోనే సాధ్యం కాలేదు. అందుకే అన్ని మూసుకుని తన పని తాను చేసుకుపోతోంది. కానీ టీఆర్ఎస్ మాత్రం ఏదో సాధించాలనే తపనతో ఉన్నా అది కుదరదని తెలిసినా దాని ప్రయత్నాలు మానుకోవడం లేదు.

వారికి ఉన్న బలం కూడా తక్కువే. బెంగాల్ లో మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం ఇద్దరు కలిస్తే మూడో కూటమి సాధ్యమేనా? అన్ని రాష్ట్రాల సీఎంలు తమ వెంట ఉన్నారని పైకి చెబుతున్నా అది అంత ఈజీ కాదనే విషయం వారికి కూడా తెలిసిందే. కానీ బీజేపీతో ఉన్న విబేదాల నేపథ్యంలో టీఆర్ఎస్ వాపును చూసుకుని బలుపుగా భ్రమిస్తోంది. కానీ దాని ఆశలు తీరే దారే కనిపించడం లేదు. కానీ ఎందుకో టీఆర్ఎస్ మాత్రం తన ప్రయత్నాలు మానకుండా అందరిని కూడగట్టాలని చూస్తోంది. ఆగస్టు తరువాత కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని భావిస్తున్నా అది కూడా అంత ప్రభావం చూపదని తెలుస్తోంది.
Also Read: Poorna: చీరలో అందాలతో కుమ్మేసిన పూర్ణ.. ఇదంతా వాటి కోసమే !