YCP Politics : రాజకీయ నాయకులకు పదవులు ఉన్నంతవరకే గౌరవ మర్యాదలు..పదవులు పక్కకు తప్పితే ఎంతటి వారైనా ప్రక్కకు నెట్టివేయ బడతా రనేది ఇది చక్కటి ఉదాహరణ. శ్రీకాకుళం జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కేంద్ర మాజీ మంత్రి, మాజీ జిల్లా వైయస్ఆర్ ప్పార్తీ అధ్యక్షురాలు కొల్లి కృపారాణి చేదు అనుభవమే ఎదురైంది. ముఖ్యమంత్రి హెలిపాడ్ లో అర్అండ్.బీ గెస్ట్ హౌస్ కు చేరుకున్నప్పుడు జిల్లాకు చెందిన మంత్రులు, శాసన సభ్యులు,ముఖ్య నేతలు స్వాగతం పలికేందుకు వచ్చారు. వారితో పాటు మొన్నటి వరకూ జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టిన మాజీ మంత్రి కిల్లి కృపారాణి కూడా హాజరయ్యారు.
సీఎం కు స్వాగతం పలికిన వారి పేర్లలో కృపారాణి పేరు లేకపోవడంతో పోలీసులు ఆమెను లోనికి అనుమతించలేదు. దీంతో ఆమె హార్డ్ అయింది. జడ్పీ చైర్మన్ పిరియా విజ్జయతో కలిసి పోలీసులతో వాదులాటకు దిగారు. అయితే సీఎంఓ కార్యాలయం నుండి వచ్చిన జాబితాలో కృపారాణి పేరు లేనందున తాము అనుమతించమని పోలీసులు చెప్పారు. దీంతో చిర్రెత్తిన కృపారాణి పోలీసులను తూర్పార పడుతూ తన వాహనంలో ఇంటికి బయలు దేరారు. ఇది గమనించిన జిల్లా పార్టీ ప్రస్తుత అధ్యక్షులు, మాజీ మంత్రి కృష్ణదాస్ కృపారాణి వాహనం వద్దకు వచ్చి సర్ది చెప్పినా ఫలితం లేకుండా పోయింది.
ఈ కోపంలోనే కృపారాణి కొడిరామ్ముర్తి స్టేడియం లో జరిగిన జగనన్న అమ్మవడి కార్యక్రమాన్ని సైతం బాయికాట్ చేయడం కొసమెరుపు. ఆ కార్యక్రమంలో కూడా కృపారాణి హాజరు కాక వెళ్లిపోవడంతో ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కృపారాణితో పాటు పలాస మున్సి పల్ ఛైర్మెన్ బల్లా గిరిబాబుతో పాటు పలువురు వీఐపీలకు కూడా పోలీసులు అనుమతించకపోవడంతో వారు కూడా వివాదాన్ని పెద్దది చేస్తున్నారు. మొత్తంగా వైసీపీలో ప్రోటోకాల్ వివాదం నేతల అసంతృప్తికి కారణమవుతోంది.