Villagers For The Dog: కుక్క కోసం ఆ గ్రామస్థులు ఏం చేశారో తెలుసా?

Villagers For The Dog: ప్రస్తుత కాలంలో మూగ జీవాలపై కొందరు కామాంధులు పైశాచికంగా లైంగిక దాడులు చేస్తున్న తరుణంలో ఆ గ్రామస్తులు ఆ మూగ జీవి కోసం అల్లాడిపోయారు. దానికి కలిగిన అనారోగ్యానికి వారిలో మానవత్వం పరిమళించింది. ఊరంతా ఏకమై దానికి వైద్యం చేయించేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఎంత కష్టమైనా సరే దానికి పుట్టిన కణతిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించి యథాతథ పరిస్థితి తీసుకొచ్చేందుకు వారంతా ముందుకు రావడం నిజంగా ముదావహం. ఓ […]

Written By: Srinivas, Updated On : June 27, 2022 3:29 pm
Follow us on

Villagers For The Dog: ప్రస్తుత కాలంలో మూగ జీవాలపై కొందరు కామాంధులు పైశాచికంగా లైంగిక దాడులు చేస్తున్న తరుణంలో ఆ గ్రామస్తులు ఆ మూగ జీవి కోసం అల్లాడిపోయారు. దానికి కలిగిన అనారోగ్యానికి వారిలో మానవత్వం పరిమళించింది. ఊరంతా ఏకమై దానికి వైద్యం చేయించేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఎంత కష్టమైనా సరే దానికి పుట్టిన కణతిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించి యథాతథ పరిస్థితి తీసుకొచ్చేందుకు వారంతా ముందుకు రావడం నిజంగా ముదావహం. ఓ మూగ జీవి కోసం వారంతా ఏకం కావడం దాని అదృష్టమే అని చెప్పొచ్చు. మానవత్వం మంటగలుస్తున్న రోజుల్లో ఓ శునకం కోసం ఆ గ్రామస్తులు అందరు కలిసి వైద్యం చేయించడం గమనార్హం.

Dog

కేరళలోని కాసర్ రోడ్డులోని కోడోం-బెల్లూర్ గ్రామపంచాయతీలో ముత్తుమణి అనే ఆడ కుక్క నివసిస్తోంది. అది ఊరందరికి కావాల్సిన దానిలా ఉండేది. దీంతో అది ఏటా కొన్ని కుక్క పిల్లలకు జన్మనిచ్చేది. ఈ క్రమంలో ఇటీవల అది కొన్ని పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో దాని రొమ్ము వద్ద ఓ వాపు కనిపించింది. వారం రోజుల్లో అది పెద్దదైంది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. దానికి వైద్య పరీక్షలు నిర్వహించాలని భావించారు. వెంటనే వెటర్నరీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యుడు కుక్కకు వచ్చిన వాపును తొలగించారు.

Also Read: Malavika Mohanan: అందాల హీరోయిన్ కి ఒంటి నిండా వెంట్రుకలే.. ఫోటోలు వైరల్ !

కానీ అది మళ్లీ యథాతథంగా వచ్చింది. దీంతో మళ్లీ ఆందోళన చెందారు. కుక్క ఆరోగ్యాన్ని బాగు చేయాలని సంకల్పించారు. ఈ సారి మంచి ఆస్పత్రిలో చూపించాలని నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాలని ప్రయత్నించారు. దీనికి గాను వైద్యుడికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో సదరు వైద్యుడు కుక్కను తీసుకెళ్లి వైద్యం చేయించేందుకు ముందుకు వచ్చాడు. ఓ వాహనంలో వచ్చి కుక్కను తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి క్షీరరసగ్రంథి కణతిని తొలగించారు. కుక్కకు నయం చేశారు.

కుక్క పట్ల ఆ గ్రామస్తులు చూపిస్తున్న ప్రేమకు డాక్టర్లు ఫిదా అయ్యారు. మూగ జీవి కోసం అందరు సమష్టిగా బాధపడి దాని ఆరోగ్యం కుదుటపడాలని ముందుకు రావడం గమనించదగినదే. మొత్తానికి కుక్కకు వైద్యం చేయించి దానికి కలిగిన బాధను తొలగించేందు కు ఆ గ్రామస్తులు పడిన శ్రమ చూస్తే అందరికి కూడా ముచ్చటేసింది. కుక్కకు వైద్యం చేయించి దాని వ్యాధిని నయం చేసి వారు సంతోషం వ్యక్తం చేశారు. తాము రోజు చూసే ఆ కుక్కకు అనారోగ్యం కలిగితే అందరు బాధ పడటం ఆశ్చర్యకరమే.

Also Read: Sammathame 3rd Day Collections: ‘సమ్మతమే’కి రికార్డ్ కలెక్షన్స్.. ఇది షాకింగే !

Tags