Bandi Sanjay- TRS: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. రెండు పార్టీల మధ్య వైరం పెరుగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై విచిత్రమైన ఆరోపణలు చేశారు. కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇందుకోసం ఫామ్ హౌస్ లో తాంత్రిక పూజలు చేస్తున్నారని ఆయన ఆరోపణ. దీంతో రాజకీయాలు మరో మలుపు తిరుగుతున్నాయి. బండి సంజయ్ చేసిన ఆరోపణలతో రెండు పార్టీల్లో మరోమారు మాటల యుద్ధం కొనసాగుతోంది. బూత వైద్యం విషయంలో బండి చేసిన విమర్శలపై కేటీఆర్ మండిపడుతున్నారు.

బండి సంజయ్ చేసిన ఆరోపణలపై మంత్రి హరీశ్ రావు కూడా స్పందించారు. సంజయ్ బూత వైద్యం కోర్సు నేర్చుకుని రావాలని సలహా ఇచ్చారు. దీంతో రెండు పార్టీల మధ్య కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రి కేటీఆర్ బండి సంజయ్ ను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించాలని చెప్పడంతో విమర్శలు తారాస్థాయికి వెళ్లాయి. రాజకీయాలు మొత్తం బూత వైద్యం చుట్టు తిరుగుతున్నాయి. కేసీఆర్ ఫాం హౌస్ లో క్షుద్ర పూజలు చేసి వాటిని కాళేశ్వరం నీళ్లో కలిపారని బండి చెప్పడం విద్వేషాలకు కారణమవుతోంది.
కేసీఆర్ కు ఉన్న దైవభక్తి నేపథ్యంలో బండి సంజయ్ చేసిన ఆరోపణలకు బలం చేకూరుతుందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తూ వారి ఆదేశాలనుసారమే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని చెబుతున్నారు. దీంతో తాంత్రిక పూజలపై అందరిలో అనుమానాలు రావడం ప్రారంభమైంది. బండి సంజయ్ చేసిన ఆరోపణలకు ఆధారాలున్నాయని ఆయన ఘంటాపథంగా చెబుతుండటంతో అందరిలో సంశయాలు పెరుగుతున్నాయి. ఫాం హౌస్ లో ఓ వ్యక్తి చనిపోతే దాన్ని కూడా దాచిపెట్టారని మరో బాంబు పేల్చారు. దీంతో ఇరు పార్టీల నేతల్లో ఆందోళన రెట్టింపవుతోంది.

ట్విట్టర్ వేదికగా వార్ జరుగుతోంది. రెండు పార్టీల మధ్య కౌంటర్లు చేసుకుంటూనే ఉన్నాయి. కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని బీజేపీ చేస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ కంగుతింటోంది. బూతవైద్యం, క్షుద్రపూజల చుట్టు రాజకీయం తిరుగుతుండటంతో టీఆర్ఎస్ పార్టీకిపెద్ద తలనొప్పిగా మారింది. రాబోయే ఎన్నికల్లో దీన్ని బేస్ గా చేసుకుని బండి సంజయ్ మరింత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసేందుకు రెడీ ఉన్నట్లు చెబుతున్నారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలతో టీఆర్ఎస్ కు మింగుడుపడటం లేదు. సంజయ్ చేసిన ఆరోపణలు అంత ఈజీగా తీసేసివి కావని తెలుస్తోంది. దీనిపై పెద్ద రాద్ధాంతం చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయి.