Homeజాతీయ వార్తలుBJP: ఉద్యోగుల సంఘం నేత విఠల్ చేరికతో బీజేపీకి కొత్త ఊపు వచ్చేనా?

BJP: ఉద్యోగుల సంఘం నేత విఠల్ చేరికతో బీజేపీకి కొత్త ఊపు వచ్చేనా?

BJP: తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ తన పంథా మార్చుకుంటోంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగులను సైతం అక్కున చేర్చుకుంటోంది. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే నినాదం బలంగా వినిపిస్తోంది. ఇందు కోసం మార్గనిర్దేశం చేస్తోంది. పలు సంఘాలను తన వైపుకు తెచ్చుకుంటోంది. టీఆర్ఎస్ నియంతృత్వ పోకడలతో బీజేపీకి ప్లస్ అవుతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ లో భయం పట్టుకుంది. ఓటమి పాలవుతామనే ఉద్దేశంతోనే బీజేపీపై టీఆర్ఎస్ విమర్శలకు దిగుతోందని తెలుస్తోంది.

Vittal
Vittal

2023లో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. కుటుంబ పాలనకు చరమగీతం పాడి ప్రజా ప్రభుత్వం నిలవాలనే కాంక్షతోనే బీజేపీ పావులు కదుపుతోంది. నాయకత్వాన్ని బలోపేతం చేసే పనిలో పడింది. తెలంగాణ ఆశయ సాధన కోసమే అహర్నిశలు శ్రమిస్తోంది. పోరాటం చేస్తున్న వారిని పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఉద్యమాల్లో పాల్గొన్న వారిని తమ పార్టీలో చేర్చుకునేందుకు ఆలోచిస్తోంది.

ఉద్యమాలకు వేదికైన తెలంగాణలో ఉద్యోగులను కూడా తమ పార్టీలో చేర్చుకుంటోంది. వారి డిమాండ్లు, హక్కులు నెరవేర్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రాష్ర్ట ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా కేసీఆర్ పై విమర్శలు చేస్తోంది. కేసీఆర్ నియంత పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Also Read: Etela Rajender: ఈటలకు ఇక మూడినట్టేనా?

అమరవీరుల ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. కేసీఆర్ కుటుంబం మొత్తం రాజకీయ లబ్ధి పొందుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని దుయ్యబట్టింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి అబ్బాస్ నఖ్వీ, తరుణ్ చుగ్ తదితరుల సమక్షంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సీహెచ్ విఠల్ బీజేపీలో చేరారు. దీంతో బీజేపీకి బలం చేకూరినట్లయింది.

Also Read: True Up Charges: ట్రూ అప్ చార్జీలపై వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version