TRS Hijack Politics: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కంట్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న వేళ్ల సరికొత్త రాజకీయాలకు తెరలేపారు. ఇప్పటికే నగరంలో ఎక్కడా బీజేపీ హెర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున అవకాశం ఇవ్వకుండా చేసిన కేసీఆర్, తాజాగా శనివారం పత్రికల్లో ఫస్ట్‌పేజీలో బీజేపీ ప్రకటన రాకుండా అడ్డుకోగలిగారు. ప్రధాన పత్రికలకు రైతుబంధు ప్రకటన ఇచ్చారు. తాజాగా బీజేపీ సమావేశాలు జరిగే రోజే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హాను రాష్ట్రానికి రప్పించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. విపక్షాల్లో అత్యధిక ఓట్లు ఉన్న కాంగ్రెస్ మద్దతుతో పోటీలో ఉన్న యశ్వంత్ సిన్హాను ఇప్పుడు టీఆర్‌ఎస్ ఓన్ చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టింది. ఈ పరిస్థితిలో తెలంగాణ కాంగ్రెస్ చేష్టలుడిగి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

అంధ్రాలో పవన్.. తెలంగాణలో రేవంత్..
కేసీఆర్ వేసిన ఎత్తుగడతో తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి కుడితలో పడ్డ ఎలుక చందంగా మారింది. తమ మద్దతులో నిలబడిన యశ్వంత్ సిన్హాను విపక్ష కూటమిలో లేని టీఆర్‌ఎస్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేసినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నా.. తాము కాంగ్రెస్‌కు దూరం అన్నట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నంతో రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పరిస్థితి ఆంధ్రాలో పవన్‌కళ్యాణ్‌లా మారింది. అక్కడ టీడీపీతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నా.. టీడీపీ నాయకులు మాత్రం పవన్‌కళ్యాణ్ తమతో ఉన్నారంటూ సంకేతాలు ఇస్తున్నారు. దీనిని జన సేనాని ఖండించలేని పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థికి పరోక్షంగా మద్దతు ఇస్తున్న కేసీఆర్ కూడా రాష్ట్రపతి అభ్యర్థిని ఓన్ చేసుకుని రేవంత్‌ను దగ్గరకు రాకుండా చేశారు. మరోవైపు కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడం లేదనే అభిప్రాయం వ్యక్తమయ్యేలా వ్యవహారం నడిపిస్తున్నారు. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు పరిస్థితి.

Also Read: Hyper Aadi: హైపర్ ఆది సంచలనం.. స్టేజ్ మీద భార్యను పరిచయం చేశాడు.. ఎవరో తెలుసా?
ఆ ఇంటిమీది కాకి ఈ ఇంటిమీద వాలందటూ..
కాంగ్రెస్ మద్దతులో విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపిన యశ్వంత్‌సిన్హా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌ను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. వాస్తవానికి యశ్వంత్‌కు టీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్ రెండూ ముఖ్యమే. టీఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్ ఓట్లే కూటమిలో ఎక్కువ అయినా కేసీఆర్ తన పంతం నెగ్గించుకోవడాని వేసిన పాచికలో టీపీసీసీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ పరిస్థితిలో ‘టీఆర్‌ఎస్‌తో కలిసి తాము రాష్ట్రపతి అభ్యర్థితో సమావేశం కాబోమని, ఆ ఇంటిమీది కాకి ఈ ఇంటిపై వాలదని ముందే చెప్పాను’ అంటూ రేవంత్ సర్ధిచెప్పుకోవాల్సి
Also Read: BJP vs TRS: బీజేపీ మైలేజ్ తగ్గించేందుకు టీఆర్ఎస్ ఆపసోపాలు.. తెగ కష్టపడుతున్న కేటీఆర్