
TRS Dharna: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ దుమారం రేగుతోంది. వరి కొనుగోలుపై రెండు పార్టీలు తమ దైన శైలిలో నిరసన ప్రదర్శనలు చేస్తున్నయి. నిన్న బీజేపీ రాష్ర్ట ప్రభుత్వంపై నిరసన చేపట్టగా నేడు టీఆర్ఎస్ పార్టీ బీజేపీపై యుద్ధం ప్రకటించింది. కేంద్రం నిర్ణయంతో రాష్ర్టంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. కేంద్రం రైతులు పక్కదారి పట్టించేందుకు పూనుకుంటుందని ఎద్దేవా చేస్తున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా గులాబీ పార్టీ ధర్నాలు చేపట్టేందుకు నిర్ణయించింది. సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీశ్ రావు, అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీపై పోరుబాట పట్టేందుకు కదిలి వచ్చారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వారిని విమర్శిస్తున్నారు. బీజేపీ నేతల మాటలతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారని మండిపడుతున్నారు. వరి కొనుగోలుపై కేంద్రం ఏం నిర్ణయించిందో దాన్ని వివరంగా చెప్పి రైతుల్లో ఉన్న అనుమానాలు తొలగించాలని కోరుతున్నారు. ఇందుకోసం టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ధర్నాల్లో భారీగా టీఆర్ఎస్ నాయకులు పాల్గొంటున్నారు.
కేంద్రం రైతుల విషయంలో స్పష్టత ఇవ్వడం లేదని చెబుతున్నారు. వరి కొంటారా? లేదా అనే విషయంలో కేంద్రం ఓ మాట చెబుతుంటే నేతలు మరోమాట మాట్లాడుతూ ఎందుకు అనుమానాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంపై ప్రత్యక్షంగా విమర్శలకు దిగుతున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు.
ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్రం మెడలు వంచి వడ్డు కొనుగోలు చేసేలా చేస్తామని పేర్కొన్నారు. బీజేపీ నేతల తీరుతో అన్నదాతల్లో అయోమయం నెలకొందని ఎద్దేవా చేస్తున్నారు. కేంద్రం రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేస్తుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టమైన ఆదేశాలు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు.
Also Read: ఆ నేతలకు కేసీఆర్ హామీలు.. ఎమ్మెల్సీలపై బుజ్జగింపులు
కాంగ్రెస్ కథ మళ్లీ మొదటికి..! రేవంత్ పై ఫిర్యాదుకు సీనియర్ నేత రెడీ..?