YSRTP: తెలంగాణలో పాలన బాగాలేందంటూ, ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ ఇక్కడి రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ, ప్రజలు కూడా అదే కోరకుంటున్నారని చెప్పారు. దానికి అనుగుణంగానే తెలంగాణ వైఎస్ఆర్‌టీపీ అనే పార్టీని స్థాపించారు. దానికి కార్యవర్గాన్ని ప్రకటించి, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు పాదయాత్ర ప్రారంభించారు. అక్టోబర్ 20వ తేదీన చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభిచారు. దీనికి ప్రజా ప్రస్థానం అనే పేరు పెట్టారు. ఇది 400 రోజుల పాటు సాగి చివరికి చేవెళ్లకు వచ్చి ముగియనుంది.

ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సాగుతున్న పాదయాత్ర..
పాదయాత్ర ప్రారంభించి ఇప్పటికి తొమ్మిది రోజులు అవుతోంది. ఈ యాత్రంలో భాగంగా ప్రతీ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు వైఎస్ షర్మిల. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేస్తున్నారు. అంతకు ముందు కూడా సభలు, సమావేశాల సందర్భంగా టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని, ఈ పాలనలో ప్రజలు సమస్యలతో సతమతమౌన్నారంటూ విమర్శలు గుప్పించే వారు. కానీ ఆ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ అస్సలు స్పందించలేదు. ఏ నాయకుడు కూడా ఆమె విమర్శలపై ప్రతి విమర్శలకు దిగలేదు. ఆ పార్టీని అస్సలు పట్టించుకోలేదు. అయితే ఇటీవల టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న కామెంట్లు ఆ పార్టీని బలోపేతం చేసేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Revanth Reddy: కేసీఆర్ తెలంగాణవాదంపై అనుమానం వ్యక్తం చేస్తున్న రేవంత్ ? ఎందుకు ?
మంత్రి వ్యాఖ్యలే కారణమా ?
తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఎన్ని కామెంట్లు చేసినా.. టీఆర్ఎస్ మౌనంగా ఉంది. దీంతో తెలంగాణ సమాజం దృష్టి పెద్దగా వైఎస్ఆర్‌టీపీపై పడలేదు. అయితే ఇప్పుడు ఆ పార్టీ గురించి మాట్లాడుకునే అవకాశం టీఆర్ఎస్, కేసీఆరే ఇస్తున్నారని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది. ఈ దీక్షపై మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతీ మంగళవారం షర్మిల దీక్ష చేస్తున్నారు. ఇప్పుడు పాదయాత్ర కొనసాగుతున్నప్పటికీ ప్రతీ మంగళవారం ఈ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షను ఉద్దేశించి ఆయన ‘మంగళవారం మరదలు బయలు దేరిందంటూ’ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. దీనిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో ధర్నా చౌక్ లో షర్మిల నిరసన చేపట్టిన సమయంలో కూడా షర్మిలపై పోలీసుల చర్యపై మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నిరసనను చెదరగొట్టడానికి మగ పోలీసులు ఆమెను చేయిపట్టి లాగేశారు. ఈ విషయాన్ని షర్మిల రాజకీయంగా పెద్దగా ఉపయోగించుకోకపోయినా.. పార్టీలకు అతీతంగా సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ రెండు ఘటనలు వైఎస్ఆర్‌టీపీ బలోపేతానికి కారణమవుతున్నా. దీని వెనక టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మంత్రి కామెంట్స్, పోలీసుల చర్యలు దీనిని బలాన్ని చేకూరుస్తున్నాయని చెబుతున్నారు.
Also Read: AP Movie Ticket rates: సినిమా కష్టాలన్నీ ప్రభుత్వం పట్టించుకోక్కర్లేదు !