Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రతీ రోజు వార్తల్లో నిలుస్తారు. ఎప్పుడూ ఎవరో ఒకరిపై కామెంట్స్ చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటున్నారు. ఆయన టీపీపీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో టీఆర్ ఎస్ సర్కార్‌పై, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతీ జిల్లా, నియోజకవర్గం తిరుగుతూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు.
సీఎం కేసీఆర్‌ను కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టేలా ఆరోపణలు..
ఇటీవల రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్ తెలంగాణ వాదాన్ని ప్రశ్నించే విధంగా కామెంట్స్ చేశారు. ఎన్నో బలిదానాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణాను సీఎం కేసీఆర్ బలిపీఠం ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల టీఆర్ ఎస్ ప్లీనరీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కారణం అయ్యాయి.
తెలంగాణ పాలన చాలా బాగుందంటూ పొరుగు రాష్ట్రాల ప్రజలు అభినందిస్తున్నారని, తమ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పోటీ చేయాలని ఏపీ వాసులు కోరుకుంటున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇటు తెలంగాణ, అటు ఏపీ రాజకీయవర్గాలను ఆలోచనలో పడేశాయి. ఏపీలో కూడా టీఆర్ఎస్ పోటీ చేయబోతోందంటూ చర్చలు ప్రారంభమయ్యాయి. కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. టీఆర్ ఎస్ పాలనను ఏపీ ప్రజలు కోరుకోవడం లేదని, అక్కడి కంటే ఇక్కడే పాలన బాగుందని అన్నారు. వైఎస్ఆర్ సీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తెలంగాణాలో ఎక్కడున్నాయని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలను మళ్లీ కలిపేయడమే ఈ సమస్యకు పరిష్కారమని అన్నారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి కలుగజేసుకున్నారు. తెలంగాణను ఏపీలో కలిపే కుట్ర జరుగుతుందంటూ కామెంట్స్ చేశారు. ఎందరో విద్యార్థుల ఆత్మబలిదానాలు, ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణను బలి పీఠం ఎక్కనివ్వబోనని అన్నారు. కేసీఆర్ పై విమర్శలు చేయడానికి కలిసి వచ్చే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోని రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని కూడా వదిలిపెట్టలేదు. సీఎం కేసీఆర్ తెలంగాణ వాదాన్ని ప్రశ్నించేలా, ఆయనను ఇరకాటంలో పెట్టేలా రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.
Also Read: AP Movie Ticket rates: సినిమా కష్టాలన్నీ ప్రభుత్వం పట్టించుకోక్కర్లేదు !
బెడిసికొట్టిన కేసీఆర్ వ్యాఖ్యలు..?
ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు రివర్స్ అయ్యేలా కనిపిస్తున్నాయి.
తెలంగాణలో టీఆర్ఎస్ పాలన గొప్పగా ఉందని చెప్పడానికి ఆయన చేసిన కామెంట్స్ ఈ చర్చకంతటికీ కారణం అయ్యాయి. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై టీఆర్ఎస్ నాయకులను కూడా ఇబ్బందులకు గురి చేసేలా ఉన్నాయి. అలాంటిదేమీ జరగదని ప్రజలకు టీఆర్ఎస్ జవాబు చెప్పాల్సిన అవసరం ఏర్పడేలా ఉంది. మరి రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్స్ పై సీఎం కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Also Read: Devullu.com: దేవుళ్ల .కామ్ ఇచ్చట ఏం దొరుకునంటే?