యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ రెండో సినిమాగా ‘మిడిస్ క్లాస్ మెలోడిస్’ మూవీ రాబోతుంది. ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రెండో సినిమాగా భవ్య క్రియేషన్స్ బ్యానర్లో ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చేస్తున్నాడు.
Also Read: ‘మెగా’ బాంబ్.. ఆచార్య మరింత ఆలస్యం?
‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మూవీకి వినోద్ అనంతోజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆనంద్ దేవరకొండ.. వర్షా బొల్లమ్మ హీరోహీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ సింగిల్ ‘గుంటూరు’ని దర్శకుడు ఇటీవల విడుదల చేయగా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను చిత్రబృందం రిలీజ్ చేసింది.
Also Read: ఆర్ఆర్ఆర్ కు ముందే రాంచరణ్ సరికొత్త రికార్డు..!
ట్రైలర్ ప్రారంభం నుంచి చివరి వరకు వినోదాత్మకంగా సాగింది. ‘మా ఊళ్లో చెట్నీ.. బొంబాయి చెట్నీ అదిరిపోద్దని.. చేసేది వీడే రాఘవ అంటూ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. గుంటూరుకు వెళ్లి టిఫిన్ సెంటర్ పెట్టి ఫేమస్ కావాలనేది రాఘవ ఆశయం.. రాఘవ బొంబాయి చెట్నీ గుంటూరు వాళ్లకి నచ్చిందా? లేదా అనేది సినిమాగా రాబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ టైటిల్ తగ్గట్టుగానే మధ్య తరగతి జీవితం.. వాళ్ల ఆశలు.. కోరికలు.. ఇబ్బందులన్నీంటిని తెరపై చక్కగా చూపించినట్లు కన్పిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో పూర్తి వినోదాత్మకంగా ఈ మూవీ రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు పల్లెటూరు బ్యాక్ ట్రాప్ లో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. దీంతో ఈ మూవీ విజయం సాధిస్తుందని చిత్రయూనిట్ నమ్మకంతో ఉంది. ఈ మూవీ నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.