Homeజాతీయ వార్తలుTrolls On Rahul Gandhi: రాహుల్ జీ విమానం రెడీగా ఉంది.. బ్యాంకాక్ వెళ్లండి.. ఇవేం...

Trolls On Rahul Gandhi: రాహుల్ జీ విమానం రెడీగా ఉంది.. బ్యాంకాక్ వెళ్లండి.. ఇవేం ట్రోల్స్ రా నాయ‌నా

Trolls On Rahul Gandhi: దేశ రాజకీయాల్లో కీలకంగా మారిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. వీటిని వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ అని ముందు నుంచే అందరూ చెబుతున్నారు. అయితే ఈ ఫలితాలు కాంగ్రెస్ భవిష్యత్తును అని తేల్చి పారేశాయి. మరీ ముఖ్యంగా ఈ ఫలితాలను చూసి అందరూ రాహుల్ గాంధీ ని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

Trolls On Rahul Gandhi
Rahul Gandhi

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని రాహుల్ ప్రధాని అవుతారని కాంగ్రెస్ శ్రేణులు మొదటి నుంచి ప్రచారం చేస్తూనే ఉన్నారు. కానీ ఎన్నికలు రాహుల్ భవితవ్యాన్ని క్లియర్ కట్ గా చెప్పేశాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు వయనాడ్ లో రాహుల్ గాంధీ ఫలూదా తింటూ ఆహ్వానిస్తున్న ఫోటోపై మీమ్స్, కామెంట్లు, జోకులు పేలుతున్నాయి. రాహుల్ గాంధీ రెస్ట్ తీసుకోవడానికి ఇది కరెక్ట్ టైం అని, వెంటనే బ్యాంకాక్ లేదా థాయిలాండ్ వెళ్లడానికి విమానం రెడీ గా ఉంది అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Also Read: దేశంలో ప్రతిపక్షం నేనట్లేనా? ఇక బీజేపీని ప్రశ్నించేదెవరు..?

ఇంకొందరేమో గాంధీ కుటుంబాన్ని కాంగ్రెస్ వదిలిపెట్టి ఎన్నికలకు వెళ్తేనే బెటర్ అంటూ చురకలు అంటిస్తున్నారు. ఇంకో నెటిజ‌న్ మాత్రం రాహుల్ గాంధీ రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నంతకాలం ఇదే పరిస్థితి కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు సైతం చమత్కరిస్తున్నారు. ప్రస్తుతం కరోనా రూల్స్ లేవు కాబట్టి విమానాలు కూడా స్టార్ట్ అయ్యాయని, టూర్ వెళ్లడానికి రాహుల్ గాంధీ బ్యాగ్ రెడీ చేసుకోవాలంటూ కామెంట్లు పేలుతున్నాయి.

Trolls On Rahul Gandhi
Rahul Gandhi

పంజాబ్ లో కాంగ్రెస్ ఓటమికి కారణమైన మాజీ సీఎం చన్నీని, మాజీ క్రికెటర్ సిద్ధూను కూడా దారుణంగా టోల్ చేస్తున్నారు. సిద్దు గతంలో క్రికెట్ ఆడినప్పుడు.. తన తప్పిదంతో బాగా ఆడేవారిని కూడా ఔట్ చేసే వాడని.. ఇప్పుడు పంజాబ్ ఎన్నికల్లో కూడా అదే చేశాడంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంకొందరేమో సిద్దు మళ్ళీ కపిల్ శర్మ షో కి వెళ్లి జోకులు వేస్తాడంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇలా నిన్న నెట్టింట్లో కాంగ్రెస్ గురించి చేస్తున్న ట్వీట్స్ మొత్తం టాప్ ట్రెండింగ్ లోనే ఉన్నాయి.

Also Read:  మోడీ రిటైర్ మెంట్.. యోగికి అపాయింట్ మెంట్?

Radhe Shyam Movie 1st Day Box Office Collections || Radhe Shyam Review || Ok Telugu Entertainment

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version