Homeఎంటర్టైన్మెంట్Prabhas Fans Injured In Radhe Shyam Movie: రాధేశ్యామ్ థియేటర్ దగ్గర ప్రమాదం.. ...

Prabhas Fans Injured In Radhe Shyam Movie: రాధేశ్యామ్ థియేటర్ దగ్గర ప్రమాదం.. సినిమా పై రాజమౌళి, గోపీచంద్ రియాక్షన్స్

Prabhas Fans Injured In Radhe Shyam Movie: ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రాధేశ్యామ్ నేడు భారీ స్థాయిలో రాధేశ్యామ్‌ విడుదల అయ్యింది. నిన్న రాత్రి కొన్ని చోట్ల ప్రివ్యూ షోస్‌ వేశారు. ఈ క్రమంలో ఎప్పుడూ దక్షిణాది నటులు, వారి చిత్రాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే కమల్‌ ఆర్‌ ఖాన్‌, రాధేశ్యామ్‌ ని చూసి హిట్‌ టాక్‌ నిచ్చేశాడు. మొదటి సగం బ్రిల్లియంట్‌ అని, రెండో సగం మొదటి సగం అంతకాకపోయినా బావుందన్నాడు, చిత్రం కచ్చితమైన హిట్‌ అన్నాడు.

Prabhas Fans Injured In Radhe Shyam Movie
Radhe Shyam Movie

మరి అసలు టాక్‌ ఏంటో మధ్యాహ్నం తెలిసిపోతుంది. ఇక ఈ సినిమా తొలి ఆటను హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్‌లో అందరికంటే ముందుగా ప్రదర్శించారు. ఇక గుంటూరు జిల్లా కారంపూడి మండలం కారంపూడిలో విషాదం చోటుచేసుకుంది. రాధేశ్యామ్ సినిమా విడుదల సందర్భంగా.. థియేటర్‌ వద్ద గురువారం రాత్రి కారంపూడిలోని ఐమ్యాక్స్‌ థియేటర్‌ దగ్గర ప్రభాస్‌ 30 అడుగుల బ్యానర్‌ కడుతుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందారు.

Also Read:   రివ్యూ : ‘రాధేశ్యామ్’

మరొకరకి గాయాలయ్యాయి. వారిని స్థానికి ఆస్పత్రికి తరలించారు. మొత్తానికి ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. అన్నట్టు రాధేశ్యామ్‌ కి శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. రాధేశ్యామ్‌ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్ సాధించాలని ఆకాంక్షించాడు.

Prabhas Fans Injured In Radhe Shyam Movie
Radhe Shyam

కాగా ఈ సందర్భంగా నటీనటులు, చిత్రబృందానికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపాడు. ఇక రాజ‌మౌళి హైద‌రాబాద్‌లో రాధేశ్యామ్ స్పెష‌ల్ షోకు హాజ‌ర‌య్యాడు. అయితే ఈ మూవీలో క్లైమాక్స్ ఎపిసోడ్‌లో షిప్ స‌న్నివేశాలు చాలా బాగున్నాయ‌ని కితాబిచ్చాడు. ఆ ఎపిసోడ్ హాలీవుడ్ ఎవ‌ర్ గ్రీన్ సూప‌ర్ హిట్ మూవీ టైటానిక్‌ను స్పూర్తిగా తీసుకుని చేశార‌ని అన్నాడు.

స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి సినిమాపై ఇలా ప్ర‌శంస‌లు కురిపించే స‌రికి ఎన్నో నెల‌లుగా స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్న ప్ర‌భాస్ టీంకు ఊపిరి పోసిన‌ట్టైంది.

Also Read: రాధేశ్యామ్ వర్సెస్ పుష్ప వర్సెస్ భీమ్లానాయక్

 

Radhe Shyam Movie 1st Day Box Office Collections || Radhe Shyam Review || Ok Telugu Entertainment

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version