https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’ సెట్స్ లో హాలీవుడ్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌.. క్లైమాక్స్ రోమాంచితమేనా!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సినిమా అంటే.. ఏ స్థాయిలో యాక్ష‌న్ ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న సినిమాల్లోని పోరాట స‌న్నివేశాలు చూస్తే.. ప్రేక్ష‌కుల గూస్ బంప్స్ కావ‌డం గ్యారెంటీ. మొద‌టి సినిమా నుంచి.. నిన్న‌టి బాహుబ‌లి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. Also Read: ఐటం సాంగ్ పై నిలదీసిన నెటిజన్ కు అనసూయ ఇచ్చిన సమాధానమిదీ ప్ర‌తీ సినిమాలోనూ ఓ హై-ఓల్టేజ్ ఫైట్ ఖ‌చ్చితంగా ఉంటుంది. అది ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని విధంగా కంపోజ్ చేయ‌బ‌డి ఉంటుంది. అలాంటిది.. […]

Written By:
  • Rocky
  • , Updated On : March 3, 2021 / 11:42 AM IST
    Follow us on


    ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సినిమా అంటే.. ఏ స్థాయిలో యాక్ష‌న్ ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న సినిమాల్లోని పోరాట స‌న్నివేశాలు చూస్తే.. ప్రేక్ష‌కుల గూస్ బంప్స్ కావ‌డం గ్యారెంటీ. మొద‌టి సినిమా నుంచి.. నిన్న‌టి బాహుబ‌లి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది.

    Also Read: ఐటం సాంగ్ పై నిలదీసిన నెటిజన్ కు అనసూయ ఇచ్చిన సమాధానమిదీ

    ప్ర‌తీ సినిమాలోనూ ఓ హై-ఓల్టేజ్ ఫైట్ ఖ‌చ్చితంగా ఉంటుంది. అది ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని విధంగా కంపోజ్ చేయ‌బ‌డి ఉంటుంది. అలాంటిది.. ఇప్పుడు ఇద్ద‌రు మాస్ హీరోలు ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి నటిస్తున్న పీరియాడిక‌ల్ డ్రామాలో ఇంకెలాంటి ఫైట్లు ఉంటాయో అని ఫ్యాన్స్ డిస్క‌స్ చేసుకుంటున్నారు. దీంతో.. అభిమానుల అంచ‌నాల‌ను ఏ మాత్రం వ‌మ్ముచేయ‌కుండా అంత‌కు మించి యాక్ష‌న్ స‌న్నివేశాలు ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు జ‌క్క‌న్న‌.

    ఇందులో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డైరెక్ట్ చేసేందుకు ప్ర‌ఖ్యాత‌ హాలీవుడ్ యాక్ష‌న్ డైరెక్టర్ నిక్ పావెల్ ను రంగంలోకి దించాడు. పావెల్ తాజాగా సెట్స్ లో అడుగు పెట్టాడు. ఈ విష‌యాఆన్ని జ‌క్క‌న్న టీం అధికారికంగా ప్ర‌క‌టించింది. ‘‘క్లైమాక్స్ గురించి ఎలాంటి స‌మాచార‌మూ రావ‌ట్లేద‌ని భావిస్తున్న ఫ్యాన్స్ కోసం ఒక అప్డేట్ ఇస్తున్నాం. క్లైమాక్స్ కోసం పావెల్ వచ్చారు’’ అంటూ ‘ఆర్ఆర్ఆర్ డైరీస్’ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది యూనిట్.

    Also Read: విరాటపర్వం అంతర్జాతీయ ఓటీటీకి.. భారీ రేటుకు.. ఎంతంటే?

    ఈ పోస్టులో పావెల్ కంపోజ్ చేస్తున్న ఫైట్ మూమెంట్ తో కూడిన వీడియోను కూడా ఉంచింది. ఆ త‌ర్వాత రాజ‌మౌళితో క‌లిసి సిస్ట‌మ్ లో ప‌రిశీఇస్తున్నాడు పావెల్‌. దీంతో.. ఈ సినిమాలో ఫైట్లు ఏ రేంజ్ లో ఉంటాయోన‌నే ఆస‌క్తి మ‌రింత‌గా బిల్డ్ అవుతోంది. డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీని.. ద‌స‌రా కానుగా అక్టోబ‌రు 13న రిలీజ్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్