https://oktelugu.com/

మోహమాటం వద్దు..సూటిగా చెప్పండి..!!

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్న షర్మిలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జల వివాదంతో షర్మిలకు కొత్త చిక్కులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆమె ఏ రాష్ట్రం తరుపున మాట్లాడియాన ఇంకో రాష్ట్ర ప్రజలు వ్యతిరేకంగా మారుతారు. ఈ నేపథ్యంలో ఆమె తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఏదో ఒకలా స్పందించాలి కనుక షర్మిల కొన్ని వ్యాఖ్యలనైతే చేసింది. కానీ ఆ వ్యాఖ్యలపై ఏ రాష్ట్ర ప్రజలు సంతృప్తి చెందలేదన్న వాదనలు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 29, 2021 / 09:26 AM IST
    Follow us on

    తెలంగాణలో కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్న షర్మిలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జల వివాదంతో షర్మిలకు కొత్త చిక్కులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆమె ఏ రాష్ట్రం తరుపున మాట్లాడియాన ఇంకో రాష్ట్ర ప్రజలు వ్యతిరేకంగా మారుతారు. ఈ నేపథ్యంలో ఆమె తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఏదో ఒకలా స్పందించాలి కనుక షర్మిల కొన్ని వ్యాఖ్యలనైతే చేసింది. కానీ ఆ వ్యాఖ్యలపై ఏ రాష్ట్ర ప్రజలు సంతృప్తి చెందలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

    రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య రోజు మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ మంత్రులు ఒక మెట్టు పైకెక్కి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలపై జగన్ స్పందన లేదు. కానీ వైఎస్ షర్మిల మాత్రం ఆచీ తూచి అడుగులు వేస్తోంది. ఎక్కడ వ్యాఖ్యం మిస్సయినా పెద్ద దూమారం అయ్యే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా కామెంట్స్ చేశారు.

    ‘తెలంగాణ రాష్ట్రానికి వచ్చే జలవనరుల్లో ఒక్క నీటి చుక్కను కూడా వదలం.. అవసరమైతే ఎవరితోనైనా పోరాటం చేస్తాం..’ అని వైఎస్ షర్మిల కామెంట్స్ చేశారు. అయితే ఎవరితోనైనా పోరాటమెందుకు స్వయంగా అన్నతో పోరాటం చేస్తానని అనొచ్చుగా అని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తెలంగాణలో రాజకీయంగా ఎదగాలనుకున్న షర్మిల ఇలా ఆదిలోనే మోహమాటం పడితే రాను రాను ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందిగా.. అని అంటున్నారు.

    ఇక షర్మిల కామెంట్లు తెలంగాణ తరుపున ఉంటే అటు రాయలసీమ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. తన పుట్టిన గడ్డకు నీళ్లు వెళ్లకుండా అడ్డుకుంటారా..? అనే విమర్శలు రానున్నాయి. అందువల్ల చాకచక్యంగా ఆచితూచి ఇలా ఎవరినీ నొప్పించకుండా కామెంట్లు చేశారు. అయితే ఇలా మోహమాట రాజకీయాలు చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని, తాడోపేడో అంటేనే ప్రజలు దరి చేరుతారని కొందరు అంటున్నారు. మరి షర్మిల చివరికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడలి..