https://oktelugu.com/

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 3,211 ఉద్యోగ ఖాళీలు..?

ఏపీ ప్రభుత్వానికి చెందిన పంచాయతీ రాజ్‌ అండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 3,211 గ్రామ, వార్డ్ వాలంటీర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజైంది. పది, ఇంటర్ పాసైన వాళ్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. జిల్లా సెలెక్షన్‌ కమిటీ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తుకు జిల్లాల వారీగా వేర్వేరు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 29, 2021 / 09:29 AM IST
    Follow us on

    ఏపీ ప్రభుత్వానికి చెందిన పంచాయతీ రాజ్‌ అండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 3,211 గ్రామ, వార్డ్ వాలంటీర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజైంది. పది, ఇంటర్ పాసైన వాళ్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. జిల్లా సెలెక్షన్‌ కమిటీ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

    దరఖాస్తుకు జిల్లాల వారీగా వేర్వేరు తేదీలు ఉండగా https://gswsvolunteer.apcfss.in/ లేదా https://apgv.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం ఉద్యోగ ఖాళీలలో శ్రీకాకుళం జిల్లాలో 576, తూర్పు గోదావరి జిల్లాలో 367, పశ్చిమ గోదావరి జిల్లాలో 432, అనంతపురం జిల్లాలో 1480, విజయనగరం జిల్లాలో 298 ఉద్యోగ ఖాళీలున్నాయి.

    పది, ఇంటర్ పాసై స్థానికంగా నివాసం ఉండేవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉండి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ తో పాటు తెలుగు రాయడం, చదవడం తెలిసి ఉండాలి. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్ లైన్ లోనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి.

    జిల్లాల వారీగా చివరి తేదీలు వేరువేరుగా ఉండగా నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.