ముక్కోణపు ప్రేమకథను ఎలా పరిష్కరించాలో తెలియక గ్రామస్తులు ఎంచుకున్న మార్గం కూడా విచిత్రంగా ఉంది. గ్రామానికి చెందిన యువకుడు సామాజిక మాధ్యమం ద్వారా వేరువేరు ప్రాంతాల్లో ఉన్న ఇద్దరు యువతులను ప్రేమించాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో రొమాన్స్ చేశాడు. అయితే ఇద్దరూ అతడిని గాఢంగానే ప్రేమించారు. ఇద్దరు నాకు కావాలంటే నాకు కావాలని పట్టుబట్టారు. దీంతో ఆ యువకుడు ఎటూ తేల్చుకోలేకపోయాడు. చివరికి ఇద్దరు అతడిని పెళ్లాడాలనే నిర్ణయించుకున్నారు.
ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో అర్థం కాక పంచాయితీని ఆశ్రయించాడు. అయినా ఫలితం తేలలేదు. ఓ యువతి అతడు లేకుండా ఉండలేనని విషయం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. కోలుకుని ఇంటికి వచ్చిన తరువాత మరోసారి పంచాయితీ నిర్వహించారు. ఎవరు కూడా వినకపోవడంతో గ్రామస్తులే ఓ మార్గాన్ని అన్వేషించారు.
లాటరీ వేసి ఎవరి పేరు వస్తే వారు పెళ్లి చేసుకోవాలని రాని వారు గోల చేయొద్దని సూచించారు. దీనికి ఇద్దరు సరే అన్నారు. దీంతో లాటరీ వేయగా ఇటీవల ఆత్మహత్యా యత్నం చేసిన యువతి పేరు వచ్చింది. దీంతో మరో యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ ఆ యువతి అక్కడి నుంచి వెళుతూ తనను మోసగించిన యువకుడిని వదలనని చెబుతూ వెనుదిరిగింది. దీంతో ఈ పెళ్లి సర్వత్రా చర్చనీయాంశమైంది.