20 ఏళ్ళకే తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో సినిమాలు చేయడం చాలా గొప్ప విషయంగా అప్పట్లో జేడీ చక్రవర్తికి ఫుల్ ఫాలోయింగ్ వచ్చింది. పైగా చాలా మంది హీరోలు కేవలం రొమాంటిక్ లేదా యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తారు, కానీ జే డీ చక్రవర్తి అలా కాదు. తన సినిమా కెరీర్ లో లవ్ స్టొరీ, యాక్షన్, థ్రిల్లర్, హారర్ ఇలా అన్ని రకాల సినిమాలు నాలుగు భాషల్లో చేసాడు.
కానీ విజయాలు రావడం ఆగిపోయాయి. దాంతో హీరో పాత్రలు దూరం అయ్యాయి. ముఖ్యంగా 21వ శతాబ్దం నుండి జేడీ చక్రవర్తి నుంచి మంచి సినిమా రాలేదు. అన్ని భాషల్లో చిన్న చిన్న పాత్రలు మాత్రమే వచ్చాయి. దుబాయ్ శ్రీను సినిమాలో కేవలం 20 నిమిషాల పాత్రలో కనిపించాడు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జేడీ చక్రవర్తి ఇప్పటికి నటిస్తున్నాడు, కానీ తెలుగులో మాత్రం అవకాశాలు రావడం లేదు. అయితే, తమిళం, మలయాళం సినిమాల నుంచి అవకాశాలు వస్తున్నాయి. జేడీ చక్రవర్తి చాలా టాలెంటెడ్. జగపతి బాబు లాగా అధ్బుతమైన విలన్ రోల్స్ కు పర్ఫెక్ట్ గా సరిపోతాడు.
కానీ ఎందుకో తెలుగు మేకర్స్ జేడీ చక్రవర్తికి అవకాశాలు ఇవ్వట్లేదు. ఏది ఏమైనా ఎందరో నటులు వస్తూ పోతూ ఉంటారు. కానీ నాలుగు భాషల్లో నటించి, అన్ని రకాల సినిమాలు చేసి, పైగా డైరెక్షన్ కూడా చేసి, పాటలు కూడా పాడే జేడీ చక్రవర్తి వంటి వ్యక్తులు ఈ కాలంలో చాలా అరుదు.