PRC: హాలీడే రోజు డ్యూటీలో ట్రెజరీ ఉద్యోగులు.. పీఆర్సీ చిక్కుముడి వీడేనా.. ?

PRC: ఏపీలో పీఆర్సీ వివాదం రోజురోజుకూ ఇంకా ముదురుతోంది. తగ్గేదేలే అని ఉద్యోగులు అంటుండగా, మరో వైపున ప్రభుత్వం కూడా ఉద్యోగులపైన సానుకూలంగా స్పందించడం లేదు. ఇంకో రెండు రెజుల్లో ఉద్యోగులు వేతనాలు అందుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వం విషయం ఎటూ తేల్చడం లేదు. పాత వేతనాలే చెల్లించాలని, పీఆర్సీ వద్దని ఓ వైపున ఉద్యోగులు అంటున్నారు. మరో వైపున ప్రభుత్వం నూతన పీఆర్సీ ప్రకారమే వేతనాల చెల్లింపు ఉంటుందని అంటోంద. మంత్రి వర్గం ఈ మేరకు […]

Written By: Mallesh, Updated On : January 30, 2022 9:23 pm
Follow us on

PRC: ఏపీలో పీఆర్సీ వివాదం రోజురోజుకూ ఇంకా ముదురుతోంది. తగ్గేదేలే అని ఉద్యోగులు అంటుండగా, మరో వైపున ప్రభుత్వం కూడా ఉద్యోగులపైన సానుకూలంగా స్పందించడం లేదు. ఇంకో రెండు రెజుల్లో ఉద్యోగులు వేతనాలు అందుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వం విషయం ఎటూ తేల్చడం లేదు.

PRC

పాత వేతనాలే చెల్లించాలని, పీఆర్సీ వద్దని ఓ వైపున ఉద్యోగులు అంటున్నారు. మరో వైపున ప్రభుత్వం నూతన పీఆర్సీ ప్రకారమే వేతనాల చెల్లింపు ఉంటుందని అంటోంద. మంత్రి వర్గం ఈ మేరకు ఆమోదం తెలపడం , జీవో రావడం జరిగిపోయింది కూడా. చర్చలకు రావాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులైన మంత్రులు ఆహ్వానిస్తారు. కానీ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు చర్చలకు రావడం లేదు.

అలా ప్రతిష్టంభన కొనసా..గుతూనే ఉన్నది. పీఆర్సీ సాధన సమితి సభ్యులు, నాయకులు ప్రభుత్వ విధానాన్ని తప్పుబడుతున్నారు. ఇకపోతే జనవరి నెల వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ట్రెజరీ శాఖ ఉద్యోగులను ఆదేశించింది. అయితే, వారు ఆదేశాలను పట్టించుకోకుండా అలాగా ఉండిపోయారు. దాంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్రెజరీ ఉద్యోగులకు నోటీసులు పంపింది. 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలోనే ఈ మేరకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.

AP CM Jagan

అయితే, ప్రభుత్వం ఎంతలా హెచ్చరించినప్పటికీ ట్రెజరీ శాఖ ఉద్యోగులు వెనక్కి తగ్గి లేదు. కానీ, ఏమైందో ఏమో తెలియదు. కానీ, ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ ఆ శాఖ ఉద్యోగులు విధుల్లోకి వచ్చారు. ఆ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. వారు వేతనాల ప్రాసెసింగ్ కోసం వచ్చినట్లు సమాచారం.

కొన్ని శాఖల ఉద్యోగులకు వేతనాలు ప్రాసెస్ చేయడం కోసం వారిని ప్రత్యేకంగా ఒప్పించి పిలిపించారనే టాక్. న్యాయస్థానాలు, పోలీస్ శాఖల్లో పనిచేస్తోన్న ఉద్యోగుల వేతనాలను చెల్లించేలా ట్రెజరీ సిబ్బంది తమ ప్రాసెసింగ్‌ను కొనసాగిస్తున్నట్లు సమాచారం. మున్సిపల్ ఉద్యోగుల వేతనాలను కూడా చెల్లించేలా చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. ఇందుకోసంగానూ 50 శాతం మంది ట్రెజరీ ఉద్యోగులు హాజరయ్యారని అంటున్నారు.

నిజానికి ప్రతీ నెల 25న ట్రెజరీ ఉద్యోగులు వేతనాలు ప్రాసెస్ చేస్తుంటారు. కానీ, పీఆర్సీ వివాదం నేపథ్యంలో ట్రెజరీ ఉద్యోగుల విధులకు ఆటంకాలు వచ్చాయి. ప్రాసెసింగ్ కొంచెం లేటయింది కూడా. ఇకపోతే పీఆర్సీ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదనే వాదన కూడా ఉంది.

Tags