ఆ లేడీ వలపు వల.. పురుషులు విలవిల

ఆమె ఓ అందమైనన సుందరి. మత్తెక్కించే కళ్లు. మైమరపించే ఒళ్లు. కవ్వించే చూపు. కైపెక్కించే వలపు. ఇంకేముంది పురుషులు పడిపోవాల్సిందే. ఆమె వయ్యారం చూస్తే మనసు జారాల్సిందే. ప్రేమ పుట్టాల్సిందే. మగవారిని మత్తెక్కించే మగువ పలు కోణాల్లో ముగ్గురిని పెళ్లి చేసుకుని ఆనక వారితో కొంత కాలం కాపురం చేసి ఉడాయిస్తోంది. బంధువుల దగ్గర అందినంత అప్పులు చేసి పరారవుతోంది. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లాకు చెందిన ఈ కిలాడీలేడీ కథ వింటే ఆశ్చర్యం వేస్తుంది. అనుమానం […]

Written By: Srinivas, Updated On : July 15, 2021 2:22 pm
Follow us on

ఆమె ఓ అందమైనన సుందరి. మత్తెక్కించే కళ్లు. మైమరపించే ఒళ్లు. కవ్వించే చూపు. కైపెక్కించే వలపు. ఇంకేముంది పురుషులు పడిపోవాల్సిందే. ఆమె వయ్యారం చూస్తే మనసు జారాల్సిందే. ప్రేమ పుట్టాల్సిందే. మగవారిని మత్తెక్కించే మగువ పలు కోణాల్లో ముగ్గురిని పెళ్లి చేసుకుని ఆనక వారితో కొంత కాలం కాపురం చేసి ఉడాయిస్తోంది. బంధువుల దగ్గర అందినంత అప్పులు చేసి పరారవుతోంది. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లాకు చెందిన ఈ కిలాడీలేడీ కథ వింటే ఆశ్చర్యం వేస్తుంది. అనుమానం మాత్రం కలగదు. సాధారణంగానే కనిపిస్తూ కనికట్లు చేస్తూ మగవారిని దోచుకుంటూ తన దారి తాను చూసుకుంటుంది. అందినంత పట్టుకుని అక్కడి నుంచి పరారవుతోంది. చివరికి అలిపిరి పోలీసులకు చిక్కింది.

చిత్తూరు జిల్లా విజయపురం మండలం నాగరాజు కండ్రిగకు చెంిన సునీల్ కుమార్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నాడు. తిరుపతిలో సత్యనారాయణపురంలో ఉంటున్నాడు. ఏడీబీ ఫైనాన్స్ లో పనిచేసే సుహాసినితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ప్రేమను సునీల్ ఇంట్లో వారు ఒప్పుకోవడంతో గతేడాది డిసెంబర్ లో వివాహం చేసుకున్నారు. పెళ్లిలో సునీల్ తల్లిదండ్రులు సుహాసినికి 20 గ్రాముల బంగారం కానుకంగా ఇచ్చారు. సుహాసిని కాపురానికి వచ్చిన తరువాత మాయమాటలు చెప్పి సునీల్ తండ్రి వద్ద రూ.2 లక్షలు తీసుకుంది. సునీల్ కు తెలియకుండా అతని బంధువుల వద్ద కూడా అప్పు చేసింది. ఈ విషయం తెలిసిన సునీల్ ఆమెను నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గత నెల 8న సుహాసిని ఇంటి నుంచి వెళ్లిపోయింది. సునీల్ తెలిసిన చోట్ల విచారణ చేయగా పలు విషయాలు వెలుగు చూశాయి.

సుహాసినికి అప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. రెండేళ్ల క్రితం కొత్తగూడెంకు చెందిన వినయ్ అనే వ్యక్తిని కూడా పెళ్లి చేసుకుని అతడిని కూడా మోసం చేసినట్లు తెలిసింది. సుహాసినిపై అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం తిరుపతి స్విమ్స్, వివేకానంద సర్కిల్ వద్ద సుహాసినిని అరెస్టు చేశారు. దీంతో వినయ్ కూడా ఆమెపై వీడియో విడుదల చేశారు.

2018లో సుహాసిని తనకు ఎవరూ లేరని అనాత అని చెప్పి పరిచయం చేసుకుందని వినయ్ తెలిపాడు. ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకోవాలని కోరటంతో 2018 మే 22న ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి జరిగిన తరువాత కుటుంబ సభ్యుల నుంచి తనకు తెలియకుండా రూ.10 లక్షలు తీసుకుంది. పెళ్ల్లైన మూడు నెలలకు ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో గమనించాడు. నెల్లూరు జిల్లా కోనేటిాజు పాలెంకు చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని తన మేనమామ అని పరిచయం చేసిందని తెలిపాడు. కానీ అతనే ఆమె మొదటి భర్త అని తెలిసిందన్నాడు.

విసయం తెలియడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే సీఐ కేసు నమోదు చేయలేదని వాపోయాడు. పోలీసు కేసు పెడుతున్నానని తెలిసిన మరునాడే ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపాడు. పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ఆమె ఆటలు సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. నన్నొక్కడినే కాదు ఇంకెంతమందిని మోసం చేసిందో తెలియదని పేర్కొన్నాడు.