కరోనా కట్టడి బాధ్యత అధికారులదే..

కరోనా ప్రళయంతో ప్రజలు ఆందోళనలో పడిపోయారు. ఆర్థిక వ్యవస్థల్నేఅతలాకుతలం చేసిన మహమ్మారితో ప్రజల ప్రాణాలు సైతం పోయాయి. ఎవరో చేసిన పాపానికి మనం ఫలితం అనుభవించడం అంటే ఇదే. ఇక్కడ పుట్టిందో తెలియదు. ఎలా వచ్చిందో తెలియదు కానీ ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించి. ప్రస్తుతం కూడా అదే దారిలో దూసుకువస్తోంది. మొదటి దశ కంటే రెండో దశ అత్యంత ప్రమాదకరంగా ప్రజల జీవితాలతో చెలగాటమాడింది. ఈ మధ్యే తగ్గినట్లు కనిపించినా మెల్లగా మళ్లీ పుంజుకుంటుందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. […]

Written By: Srinivas, Updated On : July 15, 2021 1:40 pm
Follow us on

కరోనా ప్రళయంతో ప్రజలు ఆందోళనలో పడిపోయారు. ఆర్థిక వ్యవస్థల్నేఅతలాకుతలం చేసిన మహమ్మారితో ప్రజల ప్రాణాలు సైతం పోయాయి. ఎవరో చేసిన పాపానికి మనం ఫలితం అనుభవించడం అంటే ఇదే. ఇక్కడ పుట్టిందో తెలియదు. ఎలా వచ్చిందో తెలియదు కానీ ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించి. ప్రస్తుతం కూడా అదే దారిలో దూసుకువస్తోంది. మొదటి దశ కంటే రెండో దశ అత్యంత ప్రమాదకరంగా ప్రజల జీవితాలతో చెలగాటమాడింది.

ఈ మధ్యే తగ్గినట్లు కనిపించినా మెల్లగా మళ్లీ పుంజుకుంటుందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. మూడో దశ ముప్పు ఉ:దని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా కట్టడికి చర్యలు చేపట్టాల్సిన అవసరంఎంతైనా ఉందని గుర్తిస్తున్నారు. ఇందుకు అధికారులను సిద్ధం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కేసుల సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతున్న సందర్భంల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని చెబుతున్నారు. మాస్కులు, భౌతికదూరం పాటిస్తూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

దేశంలోని చాలా ప్రాంతాల్లో మాస్కులు, భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా తిరుగుతున్నారు దీంతో వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అధికారులు జాగ్రత్తగా ఉండాలి. ప్రజలను ఎప్పడూ అప్రమత్తంగా ఉండేలా చర్యలుతీసుకోవాలి. ప్రజా రవాణా, పర్వత ప్రాంతాల్లోని పర్యాటక ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పలు ప్రాంతాల్లో ఆర్ ఫ్యాక్టర్ ఆందోళన కలిగిస్తోంది. ఇది 1.0 కంటే ఎక్కువా ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లే. నాలుగు వారాల క్రితం 0.74 శాతంగా ఉన్న ఆర్ ఫ్యాక్టర్ ప్రస్తుతం 0.95కు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. షాపింగ్ మాల్స్, మార్కెట్లు, రెస్టారెంట్లు, బస్సు, రైల్వే స్టేషన్లు, వివాహ వేడుకలు, స్టేడియాల వలన రద్దీ ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలు అమలు చేయడంలో విఫలమైన అధికారులను వ్యక్తిగతంగా బాధ్యులను చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

కొవిడ్ రెండో దశ ఇంకా ముగిసిపోలేదు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి. అలసత్వానికి చోటు ఇవ్వకూడదు. మహమ్మారి కట్టడిలో భాగంగా ఐదంచెల వ్యూహాన్ని పాటించాలి. కరోనా తీవ్రతపై ప్రధాని మోడీ సీఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వైరస్ కట్టడిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అనంతరం కేంద్ర హోం శాఖ నుంచి పలు సూచనలు వచ్చాయి.