https://oktelugu.com/

తక్కువ వడ్డీతో రూ.5 లక్షల రుణం.. 6 నెలలు ఈఎంఐ కట్టకుండా..?

దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడ్డారు. కొందరు త్వరగానే కరోనా నుంచి కోలుకుంటే మరి కొందరు మాత్రం కరోనా వల్ల ప్రాణాలను కోల్పోయారు. ఇలాంటి సమయంలో బ్యాంక్ నుంచి లోన్ పొందాలని అనుకునే వాళ్లకు బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. కరోనా నిర్ధారణ అయ్యి చికిత్స కోసం డబ్బులు కావాలన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, బ్యాంక్ నుంచి కోవిడ్ పర్సనల్ లోన్స్ పొందవచ్చు. అయితే ఈ పర్సనల్ లోన్ పొందడానికి అందరూ అర్హులు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 15, 2021 6:52 am
    Follow us on

    దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడ్డారు. కొందరు త్వరగానే కరోనా నుంచి కోలుకుంటే మరి కొందరు మాత్రం కరోనా వల్ల ప్రాణాలను కోల్పోయారు. ఇలాంటి సమయంలో బ్యాంక్ నుంచి లోన్ పొందాలని అనుకునే వాళ్లకు బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. కరోనా నిర్ధారణ అయ్యి చికిత్స కోసం డబ్బులు కావాలన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, బ్యాంక్ నుంచి కోవిడ్ పర్సనల్ లోన్స్ పొందవచ్చు.

    అయితే ఈ పర్సనల్ లోన్ పొందడానికి అందరూ అర్హులు కాదు. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ అకౌంట్ కలిగి ఉన్నవాళ్లు మాత్రమే ఈ బెనిఫిట్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పర్సనల్ లోన్ హోమ్ లోన్ తీసుకున్న వాళ్లు కూడా ఈ లోన్ పొందడానికి అర్హులేనని తెలుస్తోంది. గరిష్టంగా 5 లక్షల రూపాయల వరకు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లోన్ తీసుకోవచ్చు.

    ఎవరైతే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ అకౌంట్ ను కలిగి ఉండటంతో పాటు లోన్ తీసుకుంటారో వారు రుణం తీసుకున్న రోజు నుంచి మూడు సంవత్సరాల లోపు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రుణాలపై 6.85 శాతం వడ్డీ రేట్లను వసూలు చేస్తోంది. ఇతర బ్యాంకుల వడ్డీ రేట్లతో పోల్చి చూస్తే బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు తక్కువ మొత్తం కావడం గమనార్హం.

    ఎవరైతే ఈ లోన్ తీసుకుంటారో వారికి ఆరు నెలల మారటోరియం సౌకర్యం అందుబాటులో ఉంది. పూర్తి వివరాలకు సమీపంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఈ లోన్ వల్ల ప్రయోజనం చేకూరనుంది.