Train Ticket amount refund: కాలం ఎంతో విలువైంది.. ఈ విషయం భారతీయులకు ఇంకా అర్థం కావడం లేదు. గడిచిన కాలాన్ని తిరిగి తీసుకురావడం ఎవరి తరమూ కాదు. అయినా మన యువత టైంపాస్ చేస్తోంది. అందుకే స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా.. ఇంకా మనం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నాయి. రెండు అణుబాంబులు పడి ప్రధాన నగరాలు ధ్వంసమైనా.. ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతున్నా ఆ దేశం మాత్రం అభివృద్ధిలో గణనీయమైన ప్రగతి సాధించింది. అదే జపాన్. అక్కడి ప్రజలకు టైం విలువ తెలుసు. అందుకే అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఇక్కడి రైల్వే వ్యవస్థ కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ప్రసిద్ధి.
హై స్పీడ్ రైళ్లు..
జపాన్ హైస్పీడ్ రైళ్లకు ప్రసిద్ధి. బుల్లెట్ ట్రైన్లు కూడా అక్కడ పట్టాలపై పరిగెత్తుతున్నాయి. మనం ఇంకా ఇప్పుడిప్పుడే బుల్లెట్ బైక్‌లపై రైడ్ చేస్తున్నాం. బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మన దేశంలో రైళ్లు ఎప్పుడు సమయానికిరావు అన్న అపవాదు ఉంది. కాదు వాస్తవమే. కానీ జపాన్‌లో టైం కచ్చితంగా పాటిస్తాయి. షిన్కాన్సెన్ వంటి హై స్పీడ్ రైళ్లు సమయపాలనకు ప్రాధాన్యం ఇస్తాయి. అయితే తాజాగా ఓ రైలు కేవలం 35 సెకన్లు లేట్ అయింది. దీనికి అక్కడి రైల్వే సంస్థ భారీ మూల్యమే చెల్లించుకుంది.
సారీ చెప్పి.. చార్జీ పూర్తి రీఫండ్..
35 సెకన్ల ఆలస్యం వంటి చిన్న వైఫల్యానికి కూడా రైలు సంస్థ ప్రయాణికులందరికీ టికెట్ ధరను పూర్తిగా రీఫండ్ చేసింది. తద్వారా టైం వాల్యూను, బాధ్యతను నిరూపించుకుంది. ఈ చర్య కేవలం ఆర్థిక విషయం మాత్రమే కాదు, ప్రయాణికుల సమయానికి ఇచ్చిన విలువను తెలియజేసింది. జపాన్ రైల్వే సంస్థలు తమ సేవల్లో స్వల్ప లోపం జరిగినా, దానిని సీరియస్‌గా పరిగణించి, ప్రయాణికులకు నష్టపరిహారం అందించి తమ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుంది.
Also Read: ఇంటర్నెట్ ఉపయోగించేవారికి హెచ్చరిక..
ప్రపంచానికి ఆదర్శం..
ఈ సంఘటన జపాన్ సేవ, టైం విలువను ప్రపంచానికి చాటింది. మన లాంటి చాలా దేశాల్లో కొన్ని గంటల ఆలస్యం సాధారణంగా పరిగణించబడుతుంది. కానీ, జపాన్‌లో 35 సెకన్ల ఆలస్యానికి కూడా క్షమాపణ, రీఫండ్ అందించడం గమనార్హం. ఇది క్రమశిక్షణ, బాధ్యత, ప్రయాణికుల సంతృప్తికి ఇచ్చే ప్రాధాన్యతను సూచిస్తుంది.