US vs India Economic Impact: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు.. వివాదాస్పదం అవుతున్నాయి. గ్రేట్ అమెరికా మేక్ ఎగైన్ నినాదంతో ఎన్నికల్లో గెలిచిన ట్రంప్.. అమెరికా ఫస్ట్ నినాదం అమలు చేసేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో చాలా వరకు వివాదాస్పంద అయ్యాయి. తాజాగా ఏఐపై అమెరికాలోని అటీ కంపెనీల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఇందులో భారత్‌కు చెందినవారికి ఉద్యోగాలు ఇవ్వొద్దని హుకుం జారీ చేశారు. అమెరికా బయట పెట్టుబడి పెట్టొద్దని ఆదేశించారు. అయితే ఈ నిర్ణయంతో అమెరికాలోని భారతీయులు ఆందోళన చెందుతున్నారు. తమ హెచ్–1బీ వీసాలు రెన్యూవల్ అవుతాయో లేదో అని టెన్షన్ పడుతున్నారు. మరోవైపు అమెరికా వెళ్లాలనుకున్నవారు.. ఇప్పుడు కెనడా, యూకే, ఆస్ట్రేలియావైపు చూస్తున్నారు. దీంతో ట్రంప్ ఆదేశాలతో భారత్ కాన్నా.. అమెరికాకే ఎక్కువ నష్టం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: అమెరికా, నాటో, ఈయూ బెదిరింపులు.. భారత్ తగ్గేదేలే
సిలికాన్ వ్యాలీలో భారతీయుల ఆధిపత్యం..
సిలికాన్ వ్యాలీలో దాదాపు 30 శాతం ఐటీ ఉద్యోగులు భారతీయులే. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వంటి భారతీయ సంతతి నాయకులు టెక్ రంగంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1,000కి పైగా భారతీయ సంతతి వ్యవస్థాపకులు స్థాపించిన స్టార్టప్‌లు సిలికాన్ వ్యాలీలో 40 బిలియన్ డాలర్లకు పైగా విలువను సృష్టించాయి. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువ గంటలు పనిచేయడం, టీమ్ వర్క్‌లో నైపుణ్యం, పనిని ఓన్ చేసుకోవడంలో శ్రద్ధ చూపడం వంటి లక్షణాలతో కంపెనీలకు ప్రాధాన్య ఎంపికగా మారారు. అమెరికన్లతో పోలిస్తే, భారతీయులు తక్కువ వేతనంతో అధిక నైపుణ్యంతో పనిచేయడం వల్ల ఒక అమెరికన్ వేతనంతో ముగ్గురు భారతీయులను నియమించుకునే అవకాశం కంపెనీలకు లభిస్తోంది.
టెక్ కంపెనీలు ఏం చేస్తాయి?
ట్రంప్ ఆదేశాలు ప్రైవేట్ టెక్ కంపెనీలపై నేరుగా అమలు కాకపోవచ్చు, ఎందుకంటే అమెరికా ఫస్ట్ నినాదం ప్రభుత్వ సంస్థలకు ఎక్కువగా వర్తిస్తుంది. అయితే, ప్రభుత్వ ఒప్పందాలు, ఏఐ గ్రాంట్లపై ఆధారపడే కంపెనీలు ఈ ఆదేశాల ప్రభావానికి లోనవ్వొచ్చు. భారతీయ నిపుణులు లేకుండా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తమ పోటీతత్వాన్ని కొనసాగించలేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ ఉద్యోగులలో నైపుణ్య లోపం, ఎక్కువ వేతన డిమాండ్లు వంటి సవాళ్లు కంపెనీలను విదేశీ టాలెంట్‌పై ఆధారపడేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, టెక్ దిగ్గజాలు ట్రంప్ ఆదేశాలను పూర్తిగా పాటించే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.
Also Read: ఇండియ–పాక్ యుద్ధం నేనే ఆపిన.. మళ్లీ నాలుక మడతెట్టిన ట్రంప్
భారతీయుల పక్కచూపు..
ట్రంప్ విధానాలు అమలైతే, భారతీయ ఐటీ నిపుణులు యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాల వైపు మళ్లే అవకాశం ఉంది. ఈ దేశాలు స్పష్టమైన వీసా విధానాలు, దీర్ఘకాలిక స్థిరత్వంతో భారతీయ టాలెంట్‌ను ఆకర్షిస్తున్నాయి. భారతదేశంలోనూ టెక్ స్టార్టప్‌లు, స్థానిక ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, చాలా మంది నిపుణులు స్వదేశంలోనే కొత్త అవకాశాలను అన్వేషించే ధోరణి పెరుగుతోంది. ఉదాహరణకు, బెంగళూరులో గూగుల్, అమెజాన్, క్వాల్‌కామ్ వంటి సంస్థలు తమ ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను విస్తరిస్తున్నాయి, ఇది స్థానిక ఉద్యోగ అవకాశాలను పెంచుతోంది.