లాక్ డౌన్ ఎత్తివేత దిశగా..

రాష్ర్టంలో కరోనా పరిస్థితులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయ పనులు, లాక్ డౌన్ లపై చర్చించేందుకు ఈనెల 8న మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సమావేశంలో కీలక అంశాపై చర్చించే అవకాశం ఉంది. రాష్ర్టంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, సాగునీరు తదితర అంశాలపై చర్చించనున్నారు. పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో పెట్టుబడులు, ఎరువులు, క్రిమిసంహారక మందుల లభ్యత తదితర వ్యవసాయ సంబంధ అంశాలపై సమీక్ష చేయనున్నారు. రాష్ర్టంలో కరోనా […]

Written By: Srinivas, Updated On : June 6, 2021 6:48 pm
Follow us on

రాష్ర్టంలో కరోనా పరిస్థితులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయ పనులు, లాక్ డౌన్ లపై చర్చించేందుకు ఈనెల 8న మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సమావేశంలో కీలక అంశాపై చర్చించే అవకాశం ఉంది. రాష్ర్టంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, సాగునీరు తదితర అంశాలపై చర్చించనున్నారు. పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో పెట్టుబడులు, ఎరువులు, క్రిమిసంహారక మందుల లభ్యత తదితర వ్యవసాయ సంబంధ అంశాలపై సమీక్ష చేయనున్నారు.

రాష్ర్టంలో కరోనా తగ్గుముఖం పడుతున్న సందర్బంలో తీసుకోవాల్సిన చర్యలను మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. మూడో దశ రానుందనే వార్తల నేపథ్యంో దాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలు, జాగ్రత్తలపై కేబినెట్ చర్చించనుంది. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో దాన్ని సమర్థంగా ఎదుర్కొనే నిమిత్తమై తీసుకునే చర్యను సూచించనున్నారు.

ఈనెల 7 నుంచి 19 జిల్లాల్లో 19 డయాగ్నొస్టిక్ సెంటర్లను ప్రారంభించేందుకు కార్యక్రమాన్ని జూన్ 9వ తేదీకి వాయిదా వేయాని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కార్యక్రమంలో మంత్రులు పాల్గొని ఒకే రోజు ఒకే సమయంలో 19 సెంటర్లు ప్రారంభించనున్నారు. మంత్రులులేని చోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా డయాగ్నొస్టిక్ సెంటర్లను ప్రారంభించేలా చర్యలు చేపట్టారు.

లాక్ డౌన్ ఈనెల 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఆ తర్వాత పొడిగింపు, ఎత్తివేతపై నిర్ణయించనున్నారు. వాస్తవానికి మార్కెట్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మూడో వేవ్ ఇంపాక్ట్ వల్ల నిబంధనలు మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది.