
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఈ సాయంత్రం 7.30 గంటలకు ఆస్క్ కేటీఆర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యాక్సినేషన్ పై బోలెడన్ని ప్రశ్నలు, సందేహాలు, వ్యాఖ్యలు, సూచనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోమారు ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు ఇంటరాక్టివ్ సెషన్ చేద్దామన్నారు. #askktr, # lets talk vaccination యాష్ ట్యాగ్ లను ఉపయోగించి ప్రశ్నలు సందించాల్సిందిగా మంత్రి సూచించారు.