https://oktelugu.com/

మూడు విభిన్న పాత్రల్లో ప్రభాస్ !

నేషనల్ స్టార్ గా వచ్చిన గుర్తింపును నిలబెట్టుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా సినిమాల ప్లానింగ్ లో పర్ఫెక్ట్ జడ్జ్ మెంట్ ఉండాలి. ఒకే కథను అన్ని భాషల ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించగలగాలి. అయితే ప్రభాస్ ప్రస్తుతం అలా ఆలోచిస్తున్నాడా ? సాహో విషయంలో జరిగిన నష్టాన్ని తరువాత సినిమాలతో పూడ్చుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో కొత్తగా ఒప్పుకున్న సినిమానే నాగ్ అశ్వన్ ది. ఈ సినిమా కథ విషయంలో ఒక ఇంట్రస్టింగ్ […]

Written By:
  • admin
  • , Updated On : July 8, 2020 8:25 pm
    Follow us on


    నేషనల్ స్టార్ గా వచ్చిన గుర్తింపును నిలబెట్టుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా సినిమాల ప్లానింగ్ లో పర్ఫెక్ట్ జడ్జ్ మెంట్ ఉండాలి. ఒకే కథను అన్ని భాషల ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించగలగాలి. అయితే ప్రభాస్ ప్రస్తుతం అలా ఆలోచిస్తున్నాడా ? సాహో విషయంలో జరిగిన నష్టాన్ని తరువాత సినిమాలతో పూడ్చుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో కొత్తగా ఒప్పుకున్న సినిమానే నాగ్ అశ్వన్ ది. ఈ సినిమా కథ విషయంలో ఒక ఇంట్రస్టింగ్ థింక్ ఒకటి తెలిసింది. సినిమా నేపథ్యం మొత్తం ఓ దీవిలో జరుగుతుందట. అలాగే నేటి సమాజం తాలూకు సీన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటాయట. ఓ పురాణ కథ ఆధారంగా రాసుకున్న కథలో ప్రభాస్ మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. అంటే.. అన్ని భాషల వారికి నచ్చే అంశాల ఆధారంగా సినిమా నడుస్తోందట. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి సంబంధించిన మొత్తం స్క్రిప్ట్ ను ఇప్పటికే పూర్తి చేశాడు.

    1962 దొంగ దెబ్బ మళ్ళీ తగలనుందా?

    ప్రస్తుతం రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నాడు. ఇక అశ్విన్ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ ను కూడా ఆల్ మోస్ట్ ఫినిష్ చేశాడు. అయితే మొదట ఈ సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి తీసుకువెళ్లాలని చూసినా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఒక విధంగా కరోనాకి వ్యాక్సన్ వచ్చే దాకా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. భారీ సీన్స్ తీసే క్రమంలో వందల మంది జూనియర్ ఆర్టిస్ట్ లు కావాలి. సో.. కరోనా కాలంలో అది సాధ్యం కాదు. అందుకే వచ్చే ఏడాది సమ్మర్ తరువాత షూట్ ప్లాన్ చేస్తున్నారు.

    ఇదా అంబేద్కర్ కి ఇచ్చే గౌరవం?

    అన్నట్టు ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని మేకర్స్.. మొత్తం సాంకేతిక బృందాన్ని కూడా హాలీవుడ్ లోని ప్రముఖులనే తీసుకుంటుంది. సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల అవుతుంది కాబట్టి అవుట్ ఫుట్ విషయంలో పూర్తి విశ్వసనీయత కనబర్చాలని మేకర్స్ తాపత్రయ పడుతున్నారు. సినిమాలోని కీలక పాత్రల్లో కొంతమంది బాలీవుడ్ స్టార్స్ ను కూడా తీసుకోనున్నారు. ఏమైనా ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్ పై ప్రభాస్ బాగానే ఆశలు పెట్టుకున్నాడు. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాని భారీగా నిర్మించనున్నారు.