https://oktelugu.com/

Telangana: తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనా?

Telangana: తెలంగాణలో బీజేపీ తన బలం పెంచుకుంటోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల్లో పార్టీ బలోపేతం అయి ప్రత్యర్థి పార్టీకి సవాల్ విసురుతోంది. దీంతో టీఆర్ఎస్ లో కూడా అయోమయం ఏర్పడింది. మొదటి నుంచి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్న బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్ర పేరుతో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రతో బీజేపీ ప్రతిష్ట ఇనుమడించింది. రాష్ర్టంలో పాగా వేసేందుకు అన్ని దారులు […]

Written By:
  • Srinivas
  • , Updated On : November 24, 2021 / 05:32 PM IST
    Follow us on

    Telangana: తెలంగాణలో బీజేపీ తన బలం పెంచుకుంటోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల్లో పార్టీ బలోపేతం అయి ప్రత్యర్థి పార్టీకి సవాల్ విసురుతోంది. దీంతో టీఆర్ఎస్ లో కూడా అయోమయం ఏర్పడింది. మొదటి నుంచి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్న బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్ర పేరుతో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రతో బీజేపీ ప్రతిష్ట ఇనుమడించింది. రాష్ర్టంలో పాగా వేసేందుకు అన్ని దారులు వెతుకుతోంది.

    Also Read: పక్కా స్కెచ్ తో ఢిల్లీ టూర్.. కేసీఆర్ కు లాభమేనా..?

    Telangana

    మరోవైపు టీఆర్ఎస్ లో రోజురోజుకు లోపాలు బహిర్గతమవుతున్నాయి. దీంతో పార్టీ పరిస్థితి అధ్వానంగా మారనుంది. కుటుంబ పాలన ఆరోపణలతో కుదేలైపోతున్న పార్టీ భవిష్యత్ లో మాత్రం అధికారం చేపట్టడం కష్టమే అని తెలుస్తోంది. పార్టీలో ఉన్న సీనియర్లను పక్కన పెడుతూ తన గోతిని తానే తవ్వుకుంటోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ చేసిన తప్పులే మళ్లీ చేస్తూ అగాధంలో పడిపోతోంది.

    కేసీఆర్ మాటలపై ప్రజల్లో విశ్వసనీయత తగ్గిపోతోంది. చెప్పిన మాటలే మళ్లీ చెబుతూ ప్రజలను పక్కదారి పట్టించే సీఎంను గద్దె దించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తాజా తార్కాణమే హుజురాబాద్ ఉప ఎన్నిక. ఇక్కడ అధికార పార్టీ రూ. వందల కోట్లు కుమ్మరించినా చివరికి విజయం మాత్రం ఈటలను వరించం తెలిసిందే. ప్రజా బలం ముందు డబ్బు బలం పనిచేయదనే విషయం గ్రహించాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు ఉద్యమ పార్టీ నేతగా ప్రజలు గుర్తించినా క్రమంగా వారి నైజం బయట పడుతోంది. దీంతో ప్రజలు కూడా మారి గులాబీ పార్టీకి బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

    టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగే క్రమంలో బీజేపీ వడివడిగా అడుగులు వేస్తోంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ టీఆర్ఎస్ పార్టీని వెనకకు నెడుతూ మెల్లగా నిచ్చెన ఎక్కుతోంది. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని భావించి ప్రతి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతోంది. అయినా గులాబీ బాస్ మేమే మిన్న అంటూ అనవసర రాద్దాంతం చేస్తూ బండి సంజయ్ పాదయాత్రకు అడ్డు చెప్పి చులకన అయిపోతున్నారు. మరోవైపు బీజేపీని తిట్టిపోస్తూ వారికే మేలు చేస్తున్నారు.

    ఈ మేరకు బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో జరిగిన ప్రాంత ప్రశిక్షణ విభాగం ఆధ్వర్యంలో శిక్షణ సమావేశంలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ అధికార పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంలో పార్టీల మనుగడకు అడ్డంకులు కల్పించకుండా ఉండాల్సిన కనీస బాధ్యతను మరిచి అధికార పార్టీ అడ్డు తగలడంపై ఆక్షేపించారు. దీంతో అధికార పార్టీలో భయం పుట్టుకొస్తుందని స్పష్టమైపోతోంది. రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమనే విషయం స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.

    Also Read: ఇక ఆకర్ష్ ఈటల..! సక్సెస్ అవుతుందా..?

    Tags