Tomato Price Hike: కొండెక్కిన టమాట ధర.. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి..: ఎందుకంటే..?

Tomato Price hike: మన దేశంలో మాంసాహారం కంటే కూరగాయల భోజనం చేసేవారే ఎక్కువ. దీంతో వాటి అవసరం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మధ్య కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా టమాట ధర కొండెక్కి కూర్చుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో టామాట కొరత కారణంగా ధరలు విపరీతంగా పెరిగాయి. ఆయా ప్రాంతాలను భట్టి దీనిని 65 రూపాయల నుంచి 120 వరకు అమ్ముతున్నారు. దీంతో సామాన్యుడికి మొన్నటి […]

Written By: NARESH, Updated On : November 24, 2021 6:43 pm
Follow us on

Tomato Price hike: మన దేశంలో మాంసాహారం కంటే కూరగాయల భోజనం చేసేవారే ఎక్కువ. దీంతో వాటి అవసరం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మధ్య కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా టమాట ధర కొండెక్కి కూర్చుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో టామాట కొరత కారణంగా ధరలు విపరీతంగా పెరిగాయి. ఆయా ప్రాంతాలను భట్టి దీనిని 65 రూపాయల నుంచి 120 వరకు అమ్ముతున్నారు. దీంతో సామాన్యుడికి మొన్నటి వరకు పెట్రోల్ ధరల మోత.. ఇప్పడు కూరగాయల ధరల వాత.. అన్నట్లుగా మారింది. అత్యధిక ధరలు ఉన్న కూరగాయలు కొనలేని వారు కొన్ని రోజుల పాటు వాటి జోలికి వెళ్లకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Tomato Price Hike

ప్రతీ కూరలో టమాట ఎంతో కొంత వేస్తుంటారు. వండే కూరల్లో టామట ప్రధానమైనది. అయితే ఇప్పుడు ఆ టమాట ధర విపరీతంగా పెరిగింది. ఏపీ, తమిళనాడుల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా కూరగాయల పంటలన్నీ కొట్టుకుపోయాయి. దీంతో ఈ ప్రభావం ఇతర ప్రాంతాలపై పడింది. టమాట రాయలసీమ ప్రాంతం నుంచి ఎక్కువగా వస్తుంది. ఇటీవల ఆ ప్రాంతాల్లో వరదల సంభవించిన విషయం తెలిసిందే. అయితే మిగతా చోట్ల పండుతున్నా రవాణా సౌకర్యం లేక పంపిణీ కాలేదు. దీంతో ధర విపరీతంగా పెరిగింది. టమాట మాత్రమే కాకుండా ఇతర కూరగాయల ధరలు కూడా అమాంతం పెరిగాయి.

Also Read: అమెరికా వదిలి.. వ్యవసాయంలో రాణిస్తున్న గుంటూరు యువకుడు..

అంతో ఇంతో హైదరాబాద్లోనే టామాట కిలో రూ.65 కు విక్రయిస్తున్నారు. అదే ఆంధ్రలో 100 నుంచి 110 వరకు అమ్ముతున్నారు. ఇక కేరళలోని కొట్టాయంలో కిలో టమాట రూ.120గా ఉంది. అలాగే ఎర్నాకుళంలో 110, తిరువనంతపురంలో 103గా విక్రయిస్తున్నారు. ఇక చెన్నైలో దీనిని 100కు విక్రయిస్తున్నారు. అలాగే పుదుచ్చేరిలో 90కి అమ్ముతున్నారు. మైసూర్ లో 84, మంగళూరులో 80తో అమ్ముతున్నారు. బళ్లారిలో 78కి విక్రయిస్తున్నారు.

మొత్తంగా టమాట రూ.50 కి తగ్గకుండా విక్రయిస్తున్నారు. ఒక్కోసారి ధర పడిపోవడంతో రోడ్డుపై పారబోసే టమాట ఇలా 120 పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దక్షిణాదిలో భారీ వర్షా కారణంగా దేశ వ్యాప్తంగా టమాట కొరత తీవ్రమైంది. అయితే కూరగాయల ధరలు పెరగుదలపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తోంది. పెట్రోల్ ధరలు మరింత తగ్గిస్తే వీటి ధరలు తగ్గుముఖం పడుతాయని అంటోంది. అయితే కొందరు సామాన్యులు ప్రస్తుతం టమాట, ఇతర అత్యధిక ధరలు ఉన్న కూరగాయల జోలికి వెళ్లకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక కొందరేతే కొన్ని రోజుల పాటు కర్రీ చేసుకోవడమే మానేస్తున్నట్లు సమాచారం.

Also Read: మరో నాలుగు నెలల పాటు ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం పచ్చజెండా