https://oktelugu.com/

టాలీవుడ్ సినీ రాజకీయం: సాయం హీరోది.. బొక్క నిర్మాతకీ..!

పవన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ ముగ్గురు యువకులు మృతిచెందిన సంగతి తెల్సిందే. చిత్తూరు జిల్లాకు చెందిన పవన్ అభిమానులు విద్యుదాఘాతంతో మృతిచెందడం అందరినీ కలిచివేసింది. దీంతో ఆ కుటుంబాలు దుఖఃసాగరంలో మునిగిపోయాయి. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన పార్టీ నుంచి రూ.12.5లక్షల సాయాన్ని ప్రకటించింది. అయితే ఈ సాయం జనసేన పార్టీ చేస్తుందా? లేదా సినీ నిర్మాతలు చేస్తున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. Also Read : గ్రేట్.. పవన్ కళ్యాణ్ లో స్పందనలు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 4, 2020 / 02:15 PM IST
    Follow us on

    పవన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ ముగ్గురు యువకులు మృతిచెందిన సంగతి తెల్సిందే. చిత్తూరు జిల్లాకు చెందిన పవన్ అభిమానులు విద్యుదాఘాతంతో మృతిచెందడం అందరినీ కలిచివేసింది. దీంతో ఆ కుటుంబాలు దుఖఃసాగరంలో మునిగిపోయాయి. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన పార్టీ నుంచి రూ.12.5లక్షల సాయాన్ని ప్రకటించింది. అయితే ఈ సాయం జనసేన పార్టీ చేస్తుందా? లేదా సినీ నిర్మాతలు చేస్తున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

    Also Read : గ్రేట్.. పవన్ కళ్యాణ్ లో స్పందనలు

    మృతిచెందిన పవన్ అభిమానులను జనసేన పార్టీ ఆదుకోవడం బాగేనే ఉంది. అయిత జనసేన ప్రకటించిన సాయంలో కొంత క్లారిటీ మిస్సయినట్లు తెలుస్తోంది. ఈ సాయాన్ని జనసేన పార్టీ ఒక్కటే చేస్తుందా? లేదా సినీ నిర్మాతలతో కలిసి ఈ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు అందుస్తున్నారా? అనేది స్పష్టం చేయాల్సి ఉంది. ఇప్పటికే హీరో రాంచరణ్ ఒక్కో కుటుంబానికి 2.5లక్షలు, అల్లు అర్జున్ 2లక్షలు, #Pspk 27 team 2లక్షలు, #Pspk Team 2లక్షలు ప్రకటించాయి. ఈమేరకు పవన్ సైతం తన ట్వీటర్లో వారికి కృతజ్ఞతలు తెలిపారు.

    అయితే జనసేన పార్టీ సాయంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. సినీ నిర్మాతలు, మెగా హీరోలు సాయం ప్రకటిస్తే జనసేన పార్టీ నుంచి సాయం చేస్తున్నట్లు ప్రకటించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సాయం చేసేది ఒకరు.. పబ్లిసిటీ చేసుకునేది మరొకరా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం పవన్ కు మద్దతు ప్రకటిస్తున్నారు.

    పవన్ కల్యాణ్ ను చూసి వారంతా సాయం చేస్తున్నారని.. అలాంటప్పుడు పవన్ పై విమర్శలు చేయడం మంచిది కాదని అంటున్నారు. చేతనైనా మీరు కూడా సాయం చేయండి.. అంతేగానీ శవరాజకీయాలకు పాల్పడొద్దని హితవు పలుకుతున్నారు. పవన్ సాయంపై విమర్శలు వస్తున్న తరుణంలో జనసేన మరింత క్లారిటీ ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే..!

    Also Read :  ‘పవన్-త్రివిక్రమ్’ కో‘బలి’? ఈసారి ఏమవుతుంది?