Also Read : టాలీవుడ్ సినీ రాజకీయం: సాయం హీరోది.. బొక్క నిర్మాతకీ..!
కొన్ని దశాబ్దాలుగా మహిళలపై యాసిడ్ దాడుల సంఘటనలు చూస్తూనే ఉన్నాం.. రోజురోజుకు మహిళలపై యాసిడ్ దాడులు పెరిగిపోతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాసిడ్ ను నిషేధించాయి. దీంతో కొంత యాసిడ్ దాడులు తగ్గాయి. అయితే కొన్నిచోట్ల యాసిడ్ దాడులు వెలుగుచూస్తుండటం శోచనీయంగా మారింది. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్దకొట్టాలలో ఓ యువకుడిపై యువతి యాసిడ్ దాడి చేయడం సంచలనంగా మారింది.
పెద్దకొట్టాలకు చెందిన నాగేంద్ర ఓ యువతితో కొంతకాలం ప్రేమయాణం నడిపించాడు. అయితే సదరు యువతిని కాకుండా మరోకరిని ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆ యువతి నాగేంద్రపై పగను పెంచుకుంది. ఈక్రమంలోనే వారం క్రితమే నాగేంద్రపై యువతి యాసిడ్ దాడి చేయగా ముఖంపై గాయాలయ్యాయి. ప్రస్తుతం యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మహిళలు సైతం యాసిడ్ దాడులకు పాల్పడుతుండటంతో మగళ్లు జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే కామెంట్లు విన్పిస్తున్నారు. ప్రేమకు.. పగకు ఆడ..మగ తేడా లేదని.. క్షణికావేశంలో వారు ఎంతైనా తెగిస్తారని ఈ సంఘటన నిరూపిస్తోంది. తమకు అన్యాయం జరిగితే బాధితులు చట్టాన్ని ఆశ్రయించాలని.. ఇలా యాసిడ్ దాడులకు పాల్పడి వారు నేరస్థులు కావద్దని పలువురు సూచిస్తున్నారు. అన్నింటా సమానం అంటున్న మహిళలు ఇలాంటి విషయాల్లోనూ ముందుండటం కొసమెరుపు..!
Also Read : మరో ట్వీస్ట్: 139మంది రేప్ కేసు.. 36మందికి చేరిన సంఖ్య..!