నేటి సభా సమరం.. మోడీ బుక్కవుతారా?

పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో మోదీ ప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కోనుంది. ఇప్పటికే ప్రభుత్వంపై వస్తున్న రకరకాల విమర్శలను తిప్పకొట్టేందుకు మోదీ సిద్ధం ఉండగా ప్రతిపక్షాలు సైతం ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్ సభా పక్ష నేతగా పీయూష్ గోయల్ ను కేంద్రం నియమించింది. ఇప్పటి వరకు థావర్ చంద్ గహ్లోత్ ఉండేవారు. ఇప్పుడు జరగబోయే సమావేశంలో ప్రభుత్వానికి ఎండగట్టేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. లోక్ […]

Written By: NARESH, Updated On : July 19, 2021 8:31 am
Follow us on

పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో మోదీ ప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కోనుంది. ఇప్పటికే ప్రభుత్వంపై వస్తున్న రకరకాల విమర్శలను తిప్పకొట్టేందుకు మోదీ సిద్ధం ఉండగా ప్రతిపక్షాలు సైతం ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్ సభా పక్ష నేతగా పీయూష్ గోయల్ ను కేంద్రం నియమించింది. ఇప్పటి వరకు థావర్ చంద్ గహ్లోత్ ఉండేవారు.

ఇప్పుడు జరగబోయే సమావేశంలో ప్రభుత్వానికి ఎండగట్టేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. లోక్ సభా పక్ష నేతగా అధిర్ రంజన్ చౌదరి కంటిన్యూ అవుతాడని పార్టీ ప్రకటించింది. దీంతో ఈసారైనా ప్రభుత్వాన్ని ఇరుకున్న పెట్టేందుకు వ్యూహం పన్నాలని యోచిస్తున్నారు. కేంద్రం ఇప్పటికే రైతుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొంటోంది. ఇక లోక్ సభ సమావేశాల సందర్భంగా తాము పార్లమెంట్ వెలపల నిరసన చేపడుతామని రైతు సంఘం నాయకులుప్రకటించారు. దీని వల్ల పార్లమెంట్ లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది.

కరోనాను నిర్మూలించడంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలను చూపెడుతుందని అంటున్నారు. రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగిందని ప్రభుత్వం తెలుపగా ఆ తరువాత నుంచి వ్యాక్సినేషన్ తగ్గడం ప్రారంభమైంది.

ఈ నేపథ్యంలో నిరసనలను తట్టుకునేందకు పీయూష్ గోయల్ ను మోదీ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పీయూష్ గోయల్ కు ప్రతిపక్షాలతో సత్సంబంధాలున్నాయి. ఆయన సభ నిర్వహణ సరిగ్గా నడపగలడన్న నమ్మకం ఉంది.య సభా కార్యక్రమాల నిర్వహణలోనూ అనుభవం ఉంది. అందుకే ఆయనను మళ్లీ ఎన్నుకోవాల్సి వస్తుంది.