https://oktelugu.com/

బిగ్ బాస్‌-5లో ఫుల్‌ గ్లామ‌ర్ డోస్‌.. కంటిస్టెంట్లు వీళ్లే?

స్మాల్ స్క్రీన్ పై బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి స్పెష‌ల్ ఇంట్రో అవ‌స‌ర‌మే లేదు. దేశంలోని అన్ని భాష‌ల్లోనూ స‌క్సెస్ అయిన ఈ రియాలిటీ షో.. తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. మిగిలిన ఇండ‌స్ట్రీల్లో సాగుతున్న ‘బిగ్ బాస్’ షోలతో కంపేర్ చేస్తే.. తెలుగు షోనే ఎక్కువగా సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. అంతలా ప్రేక్షకులను ఆక‌ర్షించిన ఈ షో.. టీఆర్పీ రేటింగ్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సీజ‌న్లు […]

Written By:
  • Rocky
  • , Updated On : July 19, 2021 / 08:59 AM IST
    Follow us on

    స్మాల్ స్క్రీన్ పై బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి స్పెష‌ల్ ఇంట్రో అవ‌స‌ర‌మే లేదు. దేశంలోని అన్ని భాష‌ల్లోనూ స‌క్సెస్ అయిన ఈ రియాలిటీ షో.. తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. మిగిలిన ఇండ‌స్ట్రీల్లో సాగుతున్న ‘బిగ్ బాస్’ షోలతో కంపేర్ చేస్తే.. తెలుగు షోనే ఎక్కువగా సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. అంతలా ప్రేక్షకులను ఆక‌ర్షించిన ఈ షో.. టీఆర్పీ రేటింగ్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సీజ‌న్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. 5వ సీజ‌న్ కు రెడీ అవుతోంది. క‌రోనా లేక‌పోతే ఇప్ప‌టికే స్టార్ట్ కావాల్సిన ఈ షో.. వాయిదాలు ప‌డుతూ వ‌స్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్ర‌కారం.. సెప్టెంబ‌ర్ 5వ తేదీన సీజ‌న్‌ ప్రారంభించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఆగ‌స్టులో ప్రోమో రిలీజ్ చేస్తార‌ని టాక్‌.

    ఇప్ప‌టికే సెట్ నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. కంటిస్టెంట్ల సెల‌క్ష‌న్ కూడా ఫైన‌ల్ స్టేజ్ కు చేరుకుంది. అయితే.. వారు ఎవ‌ర‌న్న‌దానిపై ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక అంచ‌నాకు సైతం జ‌నాలు రాలేక‌పోతున్నారు. ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ.. ఏది నిజం? ఏది రూమ‌ర్‌? అన్న‌ది క్లారిటీ రావ‌ట్లేదు. డిస్క‌ష‌న్ లో ఉన్న‌వారి పేర్ల‌ను చూస్తే.. గ్లామ‌ర్ డోస్ మాత్రం ఈ సీజ‌న్లో కాస్త ఎక్కువ‌గానే ఉండేట్టు క‌నిపిస్తోంది.

    అయితే.. నాలుగో సీజ‌న్ కంటిస్టెంట్ల ఎంపిక‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఒక‌రిద్ద‌రు త‌ప్ప‌.. మిగిలిన వారంతా ఎవ‌రో తెలియ‌దని, అలాంటి వారిని తీసుకొచ్చి పెట్టార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైంది. సెల‌బ్రిటీ గేమ్ షో మాదిరిగా లేద‌ని కూడా అన్నారు. దీన్ని బ‌ట్టి ఈ సారి కాస్త జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టుగా తెలుస్తోంది. అయితే.. సెల‌బ్రిటీల‌ను తీసుకొస్తే ఎక్కువ రెమ్యున‌రేష‌న్ ఇవ్వాల్సి ఉంటుంది. పైగా కండీష‌న్స్ పెడ‌తారు. అదే.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన వారు, సాధార‌ణ కంటిస్టెంట్ల‌ను తెస్తే.. వారు ఇచ్చింది తీసుకుంటారు. చెప్పింది చేస్తారు. అందుకే.. మెజారిటీ స‌భ్యులు వాళ్లే ఉంటార‌ని తెలుస్తోంది. కొంద‌రు సెల‌బ్రిటీల‌ను కూడా ప‌ట్టుకొస్తార‌ని స‌మాచారం.

    అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ఈ సారి హీరోయిన్ ఈషా చావ్లా, రాజుగారి గ‌ది-3 ఫేమ్ అశ్విన్ బాబు, శేఖ‌ర్ మాస్ట‌ర్‌, మంగ్లీ, యాంక‌ర్లు ర‌వి, వ‌ర్షిణి, ప్ర‌త్యూష‌, సినీ న‌టి సురేఖ వాణి, బుల్లితెర న‌టులు న‌వ్య‌స్వామి, సిద్ధార్థ్ వ‌ర్మ‌, విష్ణు ప్రియ‌, సింగ‌ర్ మంగ్లీ, టిక్ టాక్ దుర్గారావు త‌దిత‌రుల పేర్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఈ సారి హోస్ట్ కూడా మారుతున్న‌ట్టు స‌మాచారం. నిన్నామొన్న‌టి వ‌ర‌కు నాగార్జునే ఉంటార‌ని అనుకున్నారు. కానీ.. ఇప్పుడు రానా ద‌గ్గుబాటి రావొచ్చ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే రానా ప‌లు షోలు చేసి తానేంటో నిరూపించుకున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి, ఇందులో ఏది నిజం? ఎవ‌రు వ‌స్తారు అన్న‌ది తెలియాలంటే.. షో స్టార్ట్ అయ్యే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.