AP 4 Rajya Sabha Seats: రాజ్యసభలోని ఏపీకి సంబంధించిన నాలుగు స్థానాలు త్వరలో ఖాళీ కాబోతున్నాయి. వీటిల్లో బీజేపీ తరపున సుజనా చౌదరి, సురేశ్ ప్రభు, టీజీ వెంకటేశ్ తో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం కొనసాగుతున్నారు. జూన్ 21వ తేదీన వీరి పదవీకాలం ముగుస్తుంది. ఈ క్రమంలో సీఎం జగన్ వీటిని ఎవరితో భర్తీ చేస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉన్న నాలుగు స్థానాలు వైసీపీకే దక్కుతాయి. సీఎం ఇప్పటికే కొందరి పేర్లను ఖరారు చేశారంటూ టాక్ వినిపిస్తోంది. దీంతో ఆశావహులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు.
సీఎం ఖరారు చేసిన వారిలో మాజీ ఎమ్మెల్యే రాజశేఖర్ ఉన్నారు. ఆయనకు రాజ్యసభ స్థానం కేటాయించడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే మొదటి నుంచి ఆయన వైసీపీ కోసం పనిచేస్తున్నారు. ఇక ప్రస్తుతం వైసీపీ నుంచి కొనసాగుతున్న విజయసాయిరెడ్డిని ఎలాగో రెన్యువల్ చేస్తారు. ఇందులో ఎలాంటి సందేశం లేదు. ఇక మిగతా పదవులను ఎవరికి కేటాయిస్తారన్నదే సస్పెన్స్ గా మారింది. వీటిపైనే వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ పదవుల విషయంలో వైసీపీపై ఢిల్లీ నుంచి పైరవీలు, ఒత్తిడి మొదలైందని సమాచారం. గతంలో బీజేపీ తరపు నుంచి నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభు లాంటి వారు రాజ్యసభకు ఎన్నికయ్యారు. కొందరు పారిశ్రామిక వేత్తలు సైతం పదవి కోసం తాడెపల్లి క్యాంప్ ఆఫీస్‌కు లైన్ కట్టే చాన్స్ ఉంది.
Also Read: సీఎం కేసీఆర్ వేయబోయే ‘మంత్రం’ అదేనా?
గతంలో వాటిని భర్తీ చేసే విషయంలో అంబానీ సన్నిహితుడైన పారిశ్రామికవేత్త పరమళ్ నత్వానీకి చాన్స్ ఇచ్చారు. ఇక ఆయన వల్ల రాష్ట్రానికి వచ్చిన లాభమేమీ లేదు. దీని కారణంగానే ఈ సారి పారిశ్రామిక వేత్తలకు చాన్స్ ఇచ్చే పరిస్థితి లేదని కొందరు చెబుతున్నారు. మరి భర్తీ విషయంలో నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావు పేరు సైతం వినిపిస్తోంది.
కానీ ఇప్పటికే నెల్లూరు జిల్లాలో రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎక్కువగానే ఉంది.ఎందుకుంటే విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డికి పక్కన పెట్టి మస్తాన్‌రావుకు పదవి ఇస్తే పార్టీలో అసంతృప్తి వచ్చే చాన్స్ ఉంది. మస్తాన్ రావుకు పదవి ఇవ్వొద్దని బీసీ కోటాలో ఇప్పటికే రాజ్యసభ పదవులు ఇప్పటికే కొందరికి వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
Also Read: రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న బీజేపీ ప్లాన్ లో కేసీఆర్ భాగమా?