https://oktelugu.com/

Aishwarya Rai Bachchan: లీక్ అయిన ఐశ్వర్య రాయ్ ఫోటో వైరల్ !

Aishwarya Rai Bachchan:  ఒకప్పటి క్లాసిక్ డైరెక్టర్ గా మణిరత్నంకి ఉన్న పేరు కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయనకు హిట్లు లేవు గాని, మేకింగ్ స్టైల్ లో అలాగే పాత్రల చిత్రీకరణలో మణిరత్నం శైలే వేరు. ఇక మణిరత్నం నుంచి వస్తున్న కొత్త సినిమా “పొన్నియన్ సెల్వన్”. కాగా ఈ సినిమాలో స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. అందరిలో కల్లా… ఐశ్వర్య రాయ్ పాత్ర కీలకం. అయితే, ఐశ్వర్య రాయ్ ‘మందాకిని’ పాత్రలో నటిస్తోంది. ఈ […]

Written By:
  • Shiva
  • , Updated On : February 3, 2022 / 11:42 AM IST
    Follow us on

    Aishwarya Rai Bachchan:  ఒకప్పటి క్లాసిక్ డైరెక్టర్ గా మణిరత్నంకి ఉన్న పేరు కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయనకు హిట్లు లేవు గాని, మేకింగ్ స్టైల్ లో అలాగే పాత్రల చిత్రీకరణలో మణిరత్నం శైలే వేరు. ఇక మణిరత్నం నుంచి వస్తున్న కొత్త సినిమా “పొన్నియన్ సెల్వన్”. కాగా ఈ సినిమాలో స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. అందరిలో కల్లా… ఐశ్వర్య రాయ్ పాత్ర కీలకం. అయితే, ఐశ్వర్య రాయ్ ‘మందాకిని’ పాత్రలో నటిస్తోంది. ఈ పాత్రలో ఐష్‌ అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ఆమె ఫోటో వైరల్ అవుతుంది.

    Aishwarya Rai Bachchan

    పొన్నియిన్‌ సెల్వన్‌’లోని ఐశ్వర్యారాయ్‌ ‘మందాకిని’ పాత్రకు సంబంధించిన ఫొటో కావడంతో నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో ఆ పిక్ ను బాగా వైరల్ చేస్తున్నారు. నిజానికి ఈ మూవీని ప్రారంభిస్తున్నప్పుడు వచ్చిన అప్‌ డేట్ తప్ప.. ఇంత వరకు మూవీకి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. తాజాగా ఐష్ ఫోటో వైరల్ అవ్వడంతో.. ఇకనైనా ఈ చిత్ర అప్‌ డేట్స్ ఇవ్వాలంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.

    Also Read: తెలంగాణలో పని మొదలుపెట్టిన పీకే టీం?

    అన్నట్టు ఆ మధ్య ఐశ్వర్యారాయ్‌ సెట్ లో ఉండగా ఆమె ఫోటో ఎవరో తీసి లీక్ చేశారు. రాణి పాత్రలో ఐశ్వర్య రాయ్ నిజంగా రాణీలానే ఉంది. ముఖ్యంగా ఆమె గెటప్ అదిరిపోయింది. అయితే, ఐశ్వర్య రాయ్ కొత్త ఫోటో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఒక గిరిజన మహిళ గెటప్ లో ఐశ్వర్యారాయ్‌ కనిపిచింది. మరి ఆ రాణికి, ఈ గిరిజన మహిళకి మధ్య సంబంధం ఏమిటి అనేది చూడాలి.

    Aishwarya Rai Bachchan

    ఇక ఈ ఫోటోలు లీక్ కావడంతో మణిరత్నం తన టీం పై సీరియస్ అయ్యాడట. అన్నట్టు ఈ “పొన్నియన్ సెల్వన్” సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగం ఈ ఏడాది నవంబర్ లో రిలీజ్ చేయాలని మణిరత్నం ప్లాన్ చేస్తున్నాడు. ఏది ఏమైనా తమిళ స్టార్ హీరోలు కార్తీ, విక్రమ్, జయం రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు, అలాగే త్రిష, ఐశ్వర్య, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

    కాగా తమిళనాట బాగా ప్రాచుర్యం ఉన్న ఓ నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇది చోళుల కథ కాబట్టి.. కథలో చాలా అంశాలు ఉంటాయి. ఇక ఐశ్వర్య రాయ్ చోళుల మహారాణిగా నటిస్తోంది. 47 ఏళ్ల ఐశ్వర్య రాయ్ ఈ మధ్య సినిమాలను తగ్గించింది. కేవలం మణిరత్నం దర్శకుడు కావడంతోనే ఆమె ఈ సినిమాలో నటించడానికి అంగీకరించింది.

    Also Read: కేసీఆరే టార్గెట్ః బీజేపీ భీమ్ దీక్ష‌ల‌తో చెక్ పెట్టే య‌త్నం?

    Tags