ఆ సర్వే ప్రకారం బెంగాల్‌ మళ్లీ దీదీదే..

మరికొద్ది రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలక మార్పులు జరగబోతున్నాయా..? ఈ ఏడాదిలో జరిగే కీలక రాష్ట్రాల ఎన్నికలతో దేశ రాజకీయాల భవిష్యత్‌ ఏంటో తేలబోతోందా..? అవును ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అదే అర్థం అవుతోంది. ఇందుకు తగ్గట్లే.. తాజాగా ఓ మీడియా సంస్థ సర్వేను నిర్వహించింది. పశ్చిమబెంగాల్.. తమిళనాడు.. కేరళ.. అసోం.. పుదుచ్చేరి రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశంపై సర్వేను చేపట్టారు. దీనికి సంబంధించిన ఫలితాలు […]

Written By: Srinivas, Updated On : January 19, 2021 1:19 pm
Follow us on


మరికొద్ది రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలక మార్పులు జరగబోతున్నాయా..? ఈ ఏడాదిలో జరిగే కీలక రాష్ట్రాల ఎన్నికలతో దేశ రాజకీయాల భవిష్యత్‌ ఏంటో తేలబోతోందా..? అవును ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అదే అర్థం అవుతోంది. ఇందుకు తగ్గట్లే.. తాజాగా ఓ మీడియా సంస్థ సర్వేను నిర్వహించింది. పశ్చిమబెంగాల్.. తమిళనాడు.. కేరళ.. అసోం.. పుదుచ్చేరి రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశంపై సర్వేను చేపట్టారు. దీనికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని తాజాగా వెల్లడించింది.

Also Read: ‘ఆర్నాబ్’ వాట్సాప్ చాట్స్.. వెలుగుచూస్తున్న సంచలన నిజాలు..!

అసెంబ్లీ ఎన్నికలకు సమయం రాకముందు నుంచే పశ్చిమబెంగాల్‌లో రాజకీయం వేడెక్కింది. మరీ ముఖ్యంగా.. గడిచిన రెండునెలల్లో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈసారి ఎలా అయినా బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలని.. దీదీ పార్టీకి షాకివ్వాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. అదే సమయంలో.. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి పశ్చిమబెంగాల్ రాజ్యాధికారం దక్కకూడదన్న యోచనలో ఆ రాష్ట్ర సీఎంగా వ్యవహరిస్తున్న మమతా బెనర్జీ ఉన్నారు. ఏది ఏమైనా ఈసారి ఎన్నికల్లో తాను విజయం సాధించేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని ఆమె విడిచి పెట్టటం లేదు. తాజాగా సర్వేలో మాత్రం.. బెంగాలీలు మమత వైపే ఉన్నట్లు చెబుతున్నారు. 298 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్‌లో మేజిక్ ఫిగర్ అయిన 148 సీట్లను దాటి 158 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంటుందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో 211 స్థానాల్లో గెలిచిన దీదీ పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఈసారి అంతటి ఘన విజయం కాకున్నా విజయం మాత్రం తథ్యమని పేర్కొంది. అదే సమయంలో బీజేపీ రాష్ట్రంలో మరింత బలపడుతుందని చెబుతున్నారు.

గత ఎన్నికల్లో మూడు స్థానాలకే పరిమితమైన బీజేపీ.. ఈసారి వందకు పైగా సీట్లను సొంతం చేసుకోనున్నట్లు పేర్కొంది. కాంగ్రెస్.. వామపక్షాలు 30 సీట్లను గెలుచుకొని మూడోస్థానంలో నిలుస్తాయని.. మరో నాలుగు స్థానాల్ని ఇతరులు గెలుస్తారని అంచనాల్ని వెల్లడించారు. ఇక కేరళలోనూ సీఎం విజయన్ నాయకత్వంలోని వామపక్ష కూటమిదే విజయమని సర్వే స్పష్టం చేసింది. కాకుంటే గతంతో పోలిస్తే.. ఈసారి ఎల్‌డీఎఫ్ గెలిచే స్థానాలు కాస్త తగ్గే అవకాశం ఉందంటున్నారు. బీజేపీ మూడు స్థానాల్లో గెలిచే వీలుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా విజయన్ ప్రజాదరణలో తన రాజకీయ ప్రత్యర్థి కంటే చాలా ముందు ఉండటం కూడా వామపక్ష కూటమి విజయానికి కారణం కానుంది.

Also Read: ‘శ్రీలక్ష్మి’ని అక్కున్న చేర్చుకున్న జగన్ సర్కార్!

తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. సర్వే తన ఫలితాల్ని వెల్లడించింది. అధికార అన్నాడీఎంకే పై ఉన్న వ్యతిరేకత ఫలితాలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఇదే అంశం విపక్ష డీఎంకే లాభాన్ని చేకూరుస్తుందని.. విజయ తీరాలకు చేరుస్తుందని చెబుతున్నారు. అన్నాడీఎంకే.. బీజేపీ కూటమి ఈసారి ఎన్నికల్లో కేవలం 98 స్థానాల్ని మాత్రమే సొంతం చేసుకుంటుందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఈ కూటమి 136 స్థానాల్లో విజయం సాధించింది. ఇక.. తాజా ఎన్నికల్లో గెలుపు డీఎంకే వైపే ఉందని తేల్చారు. చిన్నమ్మ కారణంగా అన్నాడీఎంకే విజయ అవకాశాలు భారీగా ప్రభావితం కానున్నట్లు తేల్చారు. అదే సమయంలో కమల్ హాసన్ పార్టీ ఎలాంటి ప్రభావాన్ని చూపలేదంటున్నారు. 234 స్థానాలున్న తమిళనాడులో డీఎంకే..కాంగ్రెస్ పార్టీల యూపీఏ కూటమి 162 స్థానాల్ని సొంతం చేసుకొని.. అధికారంలోకి రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

తమిళనాడు పక్కనే ఉండే పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఫలితం.. తమిళనాడు ఫలితాన్నే పోలి ఉంటుందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ అధికారాన్ని కోల్పోయి.. కాంగ్రెస్–డీఎంకేల సెక్యులర్ డెమొక్రటిక్ అలయన్స్ అధికారాన్ని సొంతం చేసుకునే వీలుంది. ఇక.. అసోంలో పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలనకు చెక్ పెట్టి విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ.. మరోసారి విజయాన్ని సాధించటం ఖాయమని చెబుతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ అస్సాం గణపరిషత్.. బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ కూటమి 86 సీట్లను గెలుచుకుంది. అందులో బీజేపీ సొంతంగా గెలిచిన స్థానాలు 60. అసోంలో 120 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. త్వరలో జరిగే ఎన్నికల్లోనూ ఎన్ డీఏ 73-81 స్థానాల మధ్య గెలిచే వీలుందని పేర్కొంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్